తెలుగు రాష్ట్రాలలో ఆ రెండు పార్టీలు చాలా బలమైనవి. నాయకులు - కార్యకర్తలు - అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్న పార్టీలు. అవి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ - జనసేన పార్టీులు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి ఖయంగా కనిపిస్తోంది. ఇప్పుడే పుట్టిన జనసేనకు కాసింత బలం ఉంది కాని, ఆంద్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం కష్టం అంటున్నారు. తెలంగాణలో కూడా ఉన్న ఈ రెండు పార్టీలకు అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లోక్ సభ స్దానాన్ని - కొన్ని శాసనసభ స్దానాల్ని గెలుచుకుంది. తెలంగాణ సెంటిమెంట్ విపరీతరంగా ఉన్న సమయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించిందంటే ఆ పార్టీకి ఉన్న బలం అర్దం చేసుకోవచ్చు. ఇంత బలం - బలగం ఉన్న ఈ సారి ఎన్నికలలో మాత్రం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటి చేయడం లేదు. తెలంగాణలోని అన్నీ జిల్లాలలోను దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డికి అభిమానులు ఉన్నారు. వారంత ఆయన తనయుడు - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అభిమానులే. ఈ అభిమానులు వారి కుటుంబ సభ్యుల ఓట్లు ఈ సారి తెలంగాణ రాష్ట్ర సమితికి బదాలాయింపు అవుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలకు పూర్తి వ్యతిరేకమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎట్టి పరిస్దితులోను మహాకూటమికి పడే అవకాశం లేదంటున్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో జగన్ కు ఉన్న స్నేహం కూడా ఇందుకు కారణం కావచ్చు అని విశ్లేషిస్తున్నారు.
ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజకీయ పార్టీగా కంటే సినీ హీరోగా తెలంగాణలో మంచి గుర్తింపు ఉంది. జనసేన అధ్యక్షడు పవన్ కల్యాణ్ ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడిపై విరుచుకు పడుతున్నారు. అలాగే జాతీయ స్దాయిలో కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు చెరుగుతున్నారు. ఈ కారణాల వలను తెలంగాణలో ఒక్కటైన కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల మహాకూటమికి వ్యతిరేకంగా పనిచేయాలని అభిమానులకు పిలుపునిస్తున్నారు. మహాకూటమికి వ్యతిరేకంగా పనిచేయడమంటే తెలంగాణ రాష‌్ట్ర సమితి కి అనుకూలంగా పనిచేయడమే అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలకు చెందిన జిల్లా నాయకులకు "కారుతో కలవండీ" అంటూ లోపాయికారి వర్తమానం వెళ్లిందని అంటున్నారు. ఈ మూడు పార్టీల లోపాయికారి కలయికను అనాధికారిక ప్రజాకూటమిగా అభివర్ణిస్తున్నారు.