జనసేన ట్రైలర్ వచ్చిందహో..

Update: 2016-10-08 11:34 GMT
మోషన్ పోస్టర్.. థీమ్ సాంగ్.. టీజర్.. ట్రైలర్.. లాంటి పదాలు కేవలం సినిమాలకు సంబంధించి మాత్రమే వింటుంటాం. చూస్తుంటాం. కానీ రాజకీయాల్లో కూడా పోస్టర్లు.. ట్రైలర్లు ఉంటాయని ‘జనసేన’ పార్టీ వాళ్లు చూపిస్తున్నారు. ‘జనసేన మనసేన’ అంటూ ఇప్పటికే ఒక మోషన్ పోస్టర్.. థీమ్ సాంగ్ రిలీజ్ చేసిన పవన్ ఫ్యాన్స్.. ఇప్పుడు ట్రైలర్ కూడా వదిలారు. గత నెలలో కాకినాడ వేదికగా ప్రత్యేక హోదా అంశంపై పవన్ భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సభకు సంబంధించిన విశేషాలతో ఈ ట్రైలర్ రూపొందింది. ఆరున్నర నిమిషాల నిడివితో ఈ వీడియోను రూపొందించారు.

సభ మొదలవడానికి ముందు ప్రశాంతమైన కాకినాడకు సంబంధించిన విజువల్స్ తో మొదలుపెట్టి.. సభ మైదానం జనసంద్రంతో నిండిపోయే వరకు అన్ని పరిణామాల్ని ఇందులో చూపించారు. పవన్ మీద జనాల్లో ఉన్న అభిమానాన్ని ప్రతిబింబింపజేయాలన్నది ఈ వీడియో ఉద్దేశంలా కనిపిస్తోంది. మధ్యలో పవన్ అభిమానుల బైట్స్ కూడా ఇచ్చారు. అందులో ఓ పెద్దావిడ కూడా ఉంది. మొత్తానికి ఏదో సభ ఏర్పాటు చేశాం.. కానిచ్చేశాం అని కాకుండా.. పవన్ ప్రయత్నాల్ని జనాల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి బ్యాగ్రౌండ్లో చాలా వర్కే నడిచిందని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. విజువల్స్ తీసుకునే క్రమంలో చాలా కసరత్తులే జరిగినట్లుంది. యువతను ఆకర్షించడానికి జనసేన చక్కటి ప్లానింగ్ తోనే సాగుతోంది.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News