జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు స్పందించటం.. పలువురు నేతలు విమర్శలు చేయటం తెలిసిందే. ఏపీ ఎంపీలను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పవన్‌పై.. ఏపీ ఎంపీలు కౌంటర్ ఇచ్చారు. మిగిలిన ఎంపీల కంటే విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శించారు.
ఈ నేపథ్యంలో విజయవాడలో జనసేన కార్యకర్తలు స్పందించారు. నిరసనలకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావటం చేతకాని ఏపీ ఎంపీలు.. ఆ విషయాన్ని ప్రశ్నించిన తమ నాయకుడ్ని.. ఏపీ ఎంపీలు ఎలా విమర్శిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
తమ నాయకుడు పవన్ కల్యాణ్ కాని ప్రచారం చేయకపోతే.. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. పవన్‌ను ప్రశ్నించటం మానేసి.. ఢిల్లీకి వెళ్లి ఏపీకి ప్రత్యేకహోదా తీసుకొచ్చి మాట్లాడాలని సవాల్ విసురుతున్నారు. ఏపీ ఎంపీలకు దమ్ముంటే.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీసి.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాగలరా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.