టీడీపీకి జ‌న‌సేన మ‌ద్ద‌తు.. ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌లేనా!

Update: 2021-09-26 02:30 GMT
తెలుగుదేశం పార్టీకి జ‌న‌సేన ఎంపీటీసీలు ఓపెన్ గా మ‌ద్ద‌తు ప‌లికారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఈ చోద్యం చోటు చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అక్క‌డ హంగ్ త‌ర‌హా ఫ‌లితాలు రాగా.. ఎంపీపీ సీట్ల‌ను టీడీపీ ద‌క్కించుకుంది. క‌నీస మెజారిటీ లేక‌పోవ‌డ‌మే కాదు, ఒక చోట అయితే మూడో స్థానంలో నిలిచింది టీడీపీ. అయినా ఎంపీపీ పీఠం మాత్రం టీడీపీకే ద‌క్కింది. దీనికి కార‌ణం జ‌న‌సేన మ‌ద్ద‌తే!

మ‌రి ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై మొద‌ట్లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. త‌మ పార్టీ విజేత‌ల‌కు శుభాకాంక్ష‌ల‌ను తెలప‌డ‌మే కాదు, ఎంపీపీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను త‌ను చూస్తాన్న‌ట్టుగా కూడా తెలిపారు. త‌మ‌కు మ‌ద్ద‌తు ఉన్న చోట ఏవైనా ఆటంకాలు ఏర్ప‌డితే స‌హించేది లేద‌న్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. మ‌రి ప‌వ‌న్ అంత ప్ర‌క‌టించినా.. జ‌న‌సేన ద‌క్కించుకున్న‌ది ఒక్క ఎంపీపీ పీఠం మాత్ర‌మే. రాష్ట్ర‌మంతా క‌లిసి జన‌సేన‌కు ఒక్క ఎంపీపీ ద‌క్కింది.

అయితే జ‌న‌సేన మ‌ద్ద‌తుతో టీడీపీ రెండు సీట్ల‌ను ద‌క్కించుకుంది! ఏపీ వ్యాప్తంగా క‌లిసి టీడీపీకి ద‌క్కింది ఐదు ఎంపీపీలు మాత్ర‌మే, అందులో కూడా రెండు ఎంపీపీలు కేవ‌లం జ‌న‌సేన మ‌ద్ద‌తు వ‌ల్లా ద‌క్కాయి! అధికారికంగా అయితే టీడీపీ, జ‌న‌సేన‌ల పొత్తు లేన‌ట్టే.

అయితే జ‌న‌సేన ఎంపీటీసీలేమో టీడీపీకే మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇలా జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు బాహాటం అయ్యింది. మ‌రి  ప‌రిణామంపై జ‌న‌సేన అధిప‌తి స్పందించాల్సి ఉంది. ఆయ‌న స్పందించ‌లేదంటే... త‌మ పార్టీ ఎంపీటీసీలు టీడీపీకి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డాన్ని స్వాగ‌తించిన‌ట్టుగానే అవుతుందని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే టీడీపీ పొత్తుల కోసం ఆర్రులు చాచుతున్న‌ట్టుగా ఉంది. వీలైతే  జ‌న‌సేన‌ను కుదిరితే బీజేపీని కూడా క‌లుపుకుని పోటీ చేయాల‌నేదే టీడీపీ కి మిగిలిన ఆశ‌. బీజేపీనేమో చంద్ర‌బాబును చీద‌రించుకుంటూనే ఉంది. అయితే జ‌న‌సేన మాత్రం ఇలా బాహాటంగానే టీడీపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతోంది!
Tags:    

Similar News