గుడివాడ పేరు మరో మారు రాష్ట్ర రాజకీయాల్లో మార్మోగిపోతుందా? అంటే గుడివాడ ఎమ్మెల్యే కానీ లేదా ఆ ప్రాంతాన్నే తమ ఇంటి పేరుగా చేసుకున్న ఎమ్మెల్యేతో కానీ పవన్ కు విభేదాలు ఇప్పట్లో ఆగవా ? అసలు ఆయన్నే ఎందుకు వైసీపీ టార్గెట్ చేస్తుందని? ఆ వివరం ఈ కథనంలో....
మంత్రి పదవి పోయినా ఉన్నా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పవన్ ను టార్గెట్ చేయడం మానుకోరు. ఆ విధంగా ఆయనకు అటెన్షన్ కావాలి అని ఒప్పుకున్నారు కూడా! పదవి ఉన్నా లేకపోయినా నాని (ఇంంటిపేరు కొడాలి) ఆయన్ను ఉద్దేశించి ఏవో అంటూనే ఉంటారు. ఇదంతా పవన్ జనంలోకి వస్తే ఇమేజ్ పెరిగిపోతుందన్న అక్కసుతోనే చేస్తున్నారని జనసేన అంటోంది. తాము అధికారం లో లేకపోయినా రేపు తమకు అధికారం రాదని తేలిపోయినా కూడా జగన్ వర్గాలు అదే పనిగా తమను ఉద్దేశించి మాట్లాడడం ఎంత వరకూ సబబు అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలని జనసేన వర్గాలు హితవు చెబుతున్నాయి.
కానీ గుడివాడ అమర్నాథ్ అనే తాజా మంత్రి మాత్రం కొడాలిని మించి స్పీచ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈయన కూడా దత్తపుత్రుడు అన్న అంశాన్ని తెర పైకి మరోసారి తెచ్చారు. అదే విధంగా రాష్ట్ర ప్రజలకు పవన్ అనే వ్యక్తి ఉన్నాడా అన్న విషయం సరిగా గుర్తు కూడా లేదని వ్యాఖ్యానించారు. బాగుంది ఇదంతా ఎందుకు ? అంటే పవన్ ను టార్గెట్ చేస్తూ పోతుంటే కౌలు రైతులకో లేదా ఇతర బాధిత వర్గాలకో ఎప్పటికప్పుడు ఆయన చేసిన మేలు అన్నది పెద్దగా వెలుగులోకి రాదని గుడివాడ అమర్నాథ్ లాంటి వారు భావిస్తున్నారని జనసేన అభిప్రాయపడుతోంది.
ఏదేమయినప్పటికీ పవన్ కు గుడివాడ అనే పదం తో గండం ఉందా లేదా జగన్ ఆదేశాలు ఉన్నా లేకున్నా మంత్రులే కోరి జనసేనానితో కయ్యం తెచ్చుకుని మీడియా అటెన్షన్ కోసం ఆర్జీవీ తరహాలో డ్రామాలు నడుపుతున్నారా అన్నది ఓ పెద్ద సంశయంగానే ఉందని పవన్ అభిమానులు అంటున్నారు.
పవన్ అనే నాయకుడు ప్రజల మధ్యకు వచ్చిన ప్రతిసారీ గుడివాడ ఎమ్మెల్యే అయిన కొడాలి నాని స్పందించేవారు. మంత్రి హోదా ఉన్నా లేకపోయినా నిన్నమొన్నటి వేళ కూడా స్పందించారు. ఆవిధంగా ఆయనకు గుడివాడ పదం ఒక విధంగా ప్రతిబంధకమే అయింది అని పరిశీలకులు అంటున్నారు. మరో నాయకుడు తాజా మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పవన్ ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడి విమర్శలు చేసి అధినేత ఆశీస్సులు మరియు ఆయన దగ్గర మార్కులు ఏక కాలంలో అందుకోవాలని చూస్తున్నారు. కానీ ఇవన్నీ ఫలితం ఇస్తాయా? పవన్ ను తిడితేనే పదవులు ఉంటాయని అనుకుంటే పేర్నినాని కొనసాగాలి..
పవన్ ను తిడితేనే పదవులు అంటే కొడాలి నాని పదవి కొనసాగి ఉండాలి. ఈ క్యాబినెట్ వరకూ.. కానీ అవేవీ జరగలేదు అంటే తిడితే పదవులు రావు కానీ తమ అధినేత జగన్ దగ్గర మాత్రమే ఇవి చెల్లుబాటు అవుతాయని చాలా మంది అనుకోవడం వారి భ్రమ అని వైసీపీ అభిమానులు కూడా అంటున్నారు.
మంత్రులలో ఒక్కొక్కరూ బయటకు వస్తూ కొత్తగా దీర్ఘాలు తీస్తున్నారన్న విమర్శలను జనసేన చేస్తోంది. టీడీపీ కూడా తన చైతన్య రథం అనే ఇ పేపర్ లో పలు వ్యాఖ్యలు చేస్తోంది. భజన బృందాల కారణంగానే ఏపీ సర్కారు సారథి అభివృద్ధిని పట్టించుకోవడం లేదు అని అంటోంది. ఇవన్నీ ఎలా ఉన్నా విశాఖ కేంద్రంగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కొత్త శత్రువుగా పవన్ కు తయారయ్యారు.
ఆయన ఏమన్నారంటే.. పవన్ ఒక పొలిటికల్ టూరిస్టు అని అన్నారు. రోజుకో డైలాగ్ చెబుతారని అన్నారు. దీనిపైనే జనసేన మండిపడుతోంది. పవన్ ఎవ్వరి కోసమే పనిచేయరని, ప్రజల కోసమే పనిచేసి పేరు తెచ్చుకుంటున్నారని ఆయన ఎవ్వరి కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేసి సాగిల పడి పదవులు అందుకోలేదని గుడివాడ అమర్నాథ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు.