సామాజిక న్యాయ భేరిలో రికార్డింగ్ డ్యాన్సులా !

Update: 2022-05-29 15:30 GMT
ఆంధ్రావ‌నిలో సామాజిక న్యాయ భేరి పేరిట మంత్రులు చేప‌ట్టిన బ‌స్సు యాత్ర మ‌రో వివాదంలో ఇరుక్కుంది. నాల్గు రోజుల పాటు శ్రీ‌కాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కూ సాగిన ఈ యాత్ర‌లో రికార్డింగ్ డ్యాన్సులు ఓ చోట చేయించార‌న్న విజువ‌ల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఇవే ఇప్పుడు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. వ‌స్తున్న జ‌నాల‌ను ఆక‌ట్టుకునేందుకు, వారు వెళ్లిపోకుండా చేసేందుకు ఈ విధంగా చేసి ఉంటార‌న్న  ఆరోప‌ణ‌లు జ‌న‌సేన చేస్తోంది. జ‌నసేన ఎఫ్బీ అకౌంట్ల‌లో వీడియోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

వీటిపై చ‌ర్య‌లేవీ ఉండ‌వా అని కూడా ప్ర‌శ్నిస్తోంది. చిన్న చిన్న జాత‌ర‌ల్లో  రికార్డింగ్ డ్యాన్సులు  వేస్తే పోలీసులు వ‌చ్చి అరెస్టులు చేసి తీసుకుని వెళ్తార‌ని మ‌రి ఇప్పుడు అధికార పార్టీనే ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు చేయించ‌డం ఏంట‌న్న‌ది వారి ప్ర‌శ్న.

ప్ర‌భుత్వం ఏం చేసినా చెల్లుతుంది. మ‌ద్యం విష‌య‌మై ఫారెన్ స‌రుకు అమ్ముతూ ఆదాయం పెంచుకున్నా, చేప‌లు,మాంసం అమ్మ‌కాలు అంటూ దుకాణాలు పెట్టుకున్నా, లేదా  ఇవ‌న్నీ యువ‌త కోస‌మే అని చెప్పుకున్నా ఏం చేసినా చెల్లిపోతుంది అన్న‌ది విప‌క్షాల మాట.

ఎపార్ట్ ఫ్ర‌మ్ దిస్.,. మంత్రులంత‌గా వ‌చ్చినా కూడా జనాల‌లో చాలా అంటే చాలా అస‌హ‌నం ఉంది. ఎందుకంటే ఎవ్వ‌రూ వాస్త‌వాలు మాట్లాడ‌లేదు. గ‌ణాంకాలు చెప్ప‌లేదు. మ‌హానాడు కు కౌంట‌ర్లు ఇప్పించేందుకు బ‌స్సు యాత్ర క‌వ‌ర్ చేసిన సాక్షి విలేక‌రులు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు.

చాలా చోట్ల బ‌స్సు యాత్ర‌కు స్వాగ‌తం ప‌లికేందుకు ఎంపీడీఓ స్థాయి వ్య‌క్తులు ఎండ‌లో నిరీక్షించాల్సి వ‌చ్చింది. అయినా బ‌స్సు ఆగ‌కుండానే వెళ్లిపోయింది అని, ప‌నులు మానుకుని గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షిస్తే క‌నీసం మంత్రుల ప‌ల‌క‌రింపు కానీ ప‌ట్టింపు కానీ లేవ‌ని వాపోతున్నారు. మంత్రుల‌లో కూడా వాగ్ధార లేద‌ని చెప్పినవే చెప్పి విసుగు తెప్పించార‌ని , సామాజిక న్యాయం గురించి వాళ్లు చెప్పిందేదో ఇప్ప‌టికీ అర్థం కావ‌డంలేద‌ని ప‌లువురు అంటున్నారు. తమ‌కు కావాల్సింది కాకుండా వాళ్ల‌కు న‌చ్చిందేదో చేసుకుంటూ వెళ్లి, వాటికి సంక్షేమం అని పేర్లు పెట్ట‌డం స‌బ‌బుగా లేద‌న్న వాద‌న కూడా ఉంది.
Tags:    

Similar News