ఏపీలో జనసేన రాజకీయ పార్టీయేనా అని ఈసడించిన ప్రత్యర్ధులు ఉన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీకెండ్ పాలిటిక్స్ చేస్తారు. ఆ పార్టీకి క్యాడర్ లేదు, లీడర్స్ లేరు అని కూడా ఎద్దేవా చేస్తూంటారు. అయితే తాజాగా కొందరు చేసిన సర్వేలో ఏపీలో జనసేన గ్రాఫ్ బాగానే పెరిగింది అని అంటున్నారు.
పవన్ వీకెండ్ పాలిటిక్స్ చేస్తూ కార్యవర్గాలు పార్టీ నిర్మాణం వంటివి పెద్దగా లేకుండానే ఈ రోజుకు చూస్తే ఏకంగా పది అసెంబ్లీ సీటు, రెండు పార్లమెంట్ సీట్లు డ్యాం ష్యూర్ గా గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. జనసేన కు జనంలో ఉన్న బలానికి ఈ గ్రాఫ్ పెరగడం ఒక నిదర్శనం అని అంటున్నారు.
ఏపీలో అనకాపల్లి, కాకినాడ రెండు ఎంపీ సీట్లు జనసేన గెలుచుకుంటుందని ఆ సర్వే చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అలాగే ఉత్తరాధ్రాలో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన బలం బాగా ఉన్నట్లుగా సర్వే చెబుతున్నట్లుగా ప్రచారం అయితే ఉంది. అసెంబ్లీ స్థానాలు చూస్తే కనుక విజయవాడ పశ్చిమ, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి, కర్నూలు, పాణ్యం వంటి నియోకవర్గాల్లోనూ జనసేన దూకుడుగానే ఉందని సర్వే చెబుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు.
ఒక విధంగా చూస్తే ఈ సర్వే జనసేనకు బూస్టప్ ఇచ్చేట్లుగా ఉంది అని అంటున్నారు. ప్రజా రాజ్యం పార్టీ పెట్టినపుడు చిరంజీవ్కి ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. అలాంటిది జనసేనకు రెండు ఎంపీ సీట్లు అంటే ఆశ్చర్యమే అని అంటున్నారు. ఒక ఎంపీ సీట్లో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఆ లెక్కన ఇంకా ఎక్కువ సీట్లే ఆ పార్టీకి అసెంబ్లీ వైజ్ గా చూస్తే రావాలని అంటున్నారు.
అయితే ఎంపీ సీట్లుగా కాకినాడ, అనకాపల్లి రెండూ చూపించినా నర్సాపురం ఎంపీ సీటులో కూడా జనసేన పోటీ చేస్తే గెలిచి తీరుతుందని అంటున్నారు. ఇలా వచ్చిన సర్వే కేవలం పట్టణ ప్రాంతాలలోనే చేశారు, అదే రూరల్ ఏరియాలో చేస్తే ఇంకా లోతైన ఫలితాలు వస్తాయని అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ వారాహీ రధం ఎక్కకుండానే ఇన్ని సీట్లతో గ్రాఫ్ పెరిగింది అంటే ఆయన ఏపీ అంతా తిరిగితే రాజకీయం మారవచ్చు అన్న వారూ ఉన్నారు. అయితే ఈ సర్వేలు ప్రచారాల మీద కూడా రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ సర్వేలు చేయించుకుంటున్న నేపధ్యం ఉంది. అలాగే ఆ పార్టీ నాయకులు అభిమానులు కూడా సర్వేలు చేస్తున్నారు.
అయితే ఇక్కడ ఒక్క విషయం ఉంది. జనసేన కనుక రెండు ఎంపీ సీట్లు గెలుచుకునే స్థితిలో ఉంటే ఎన్నికల నాటికి గ్రాఫ్ పెరిగి అది కాస్తా డబుల్ డిజిట్ అయ్యే చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికలో జనసేన పొత్తులతో పోటీ చేస్తే ఒక లెక్క ఉంటుంది. అలా కాకుండా సొంతంగా పోటీకి దిగితే అప్పుడు త్రిముఖ పోటీ ఉంటుంది.
అలాంటపుడు కచ్చితంగా పార్టీ నిర్మాణం క్యాడర్ లీడర్ అవసరం పడతయని అంటున్నారు. ఏది ఏమైనా జనసేన అభిమానులకు ఈ సర్వే ఫలితాలు హ్యాపీని ఇస్తున్నాయని అంటున్నారు. గ్రౌడ్ లెవెల్ రియాల్టీస్ ఏంటో ఇంకా చూడాల్సి ఉందని అనే వారూ ఉన్నారు. ఎన్నికలకు దగ్గర చేసి వచ్చే ఫలితాలే అసలైనవి అన్న వారూ ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.