తాజాగా జరిగిన పరిణామాలు.. చంద్రబాబు - పవన్ భేటీ అనంతరం..ఏం జరుగుతుందనే విషయాలు.. ఒకవైపు రాజకీయంగా చర్చకు వచ్చాయి. మరోవైపు... జనసేనలో మరో చర్చ జరుగుతోంది. పార్టీ పొత్తులపై నేతలకు రెండో థాట్ లేకపోయినా.. తమకు న్యాయం చేయడం విషయంలో జనసేనాని ఎలా ముందుకు సాగుతారు? అనేది వీరి ప్రధాన సందేహం. ఎందుకంటే.. వచ్చే ఎన్నికలపై చాలా మంది జనసేన నాయకులు కూడా ఆశలు పెట్టుకున్నారు.
ఏదో పవన్‌వెనుక తిరిగేసి.. కాలం గడిపేద్దామని చాలా మంది అనుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే.. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల.. కొన్ని సీట్లయితే వస్తాయి.
కానీ, తమకు వస్తాయనే గ్యారెంటీ ఏంటి? అనేది.. జనసేన నేతల ప్రశ్న. అంతేకాదు.. పొత్తులో భాగంగా.. ఇరు పార్టీలకు నచ్చిన నాయకులనే ఎంపిక చేస్తారా? లేక.. మరేంటి? ఎప్పటి నుంచో పార్టీ జెండా మోస్తున్నవారికి అవకాశం ఇస్తారా? అనేది ప్రశ్న.
ఇక, మరో ముఖ్యమైన ప్రశ్న.. ఇప్పటి వరకు అంతా తానే చేశానని పవన్ చెబుతున్నా.. అంతర్గతంగా.. పార్టీకి కీలకమైన వారు లక్షల్లోనే ఖర్చు చేస్తున్నారు. వీరంతా కూడా..వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారం లోకి వస్తుందని.. పవన్ సీఎం అవుతారని.. చెబుతున్నారు.
మరి ఇప్పుడు పొత్తులో భాగంగా.. ఈ విషయం తేలలేదు. దీంతో ఇప్పుడు అభిమానులకు ఏం చెప్పాలి..? పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
మొత్తానికి జనసేన-టీడీపీ పొత్తు ఎలా ఉన్నప్పటికీ.. ఎన్నికలకు ముందు.. జనం నాడిని పసిగట్టడం.. వారిని పార్టీవైపు మళ్లించడం అనేది పెద్ద పరీక్షే అనేది జనసేన సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. నిన్న మొన్నటి వరకు.. టీడీపీతో కలవని నాయకులు ఇప్పుడు కండువాలు కప్పుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై పవన్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.