వచ్ఛేది జనసేన సర్కారే...జె గ్యాంగ్ కి చుక్కలే... ఇది కన్ ఫర్మ్

Update: 2022-11-15 16:30 GMT
ఏపీలో వచ్చేది జనసేన ప్రభుత్వమే అని జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు పక్కా క్లారిటీగా చెప్పేశారు. ఏపీలో వైసీపీ ఏలుబడిలో  పెద్ద ఎత్తున అవినీతి సాగుతోందని ఆయన తాజాగా విమర్శించారు. అంతే కాదు జగన్ సర్కార్ మీద మాటలతో మంటలే పుట్టించారు. ఏపీలో జగనన్న ఇళ్లలో వేల కోట్లలో అవినీతి జరిగింది అని ఆయన ఆరోపించారు.

సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఇళ్ళ నిర్మాణంలో ఎక్కడా అవినీతి చోటు చేసుకోలేదని చెప్పిద దానికి కౌంటర్ గా అవినీతి జరిగింది బాసూ అంటూ నాగబాబు వివరాలు అన్నీ గటగటా వల్లించారు. ఇసుక సిమెంట్ నుంచి అన్నీ కూడా అవినీతి మయమే అని ఆయన అంటున్నారు.

అలా జే గ్యాంగ్ చేసిన అవినీతిని జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక బయటపెట్టి అంతా కక్కిస్తామని కూడా ఆయన స్ట్రాంగ్ గానే స్టేట్మెంట్ ఇచ్చేశారు. జగనన్న కాలనీ ఇళ్ళ కోసం ఇసుకను ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా లబ్దిదారులు టన్ను 675 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడాన్ని ఏమంటారని వైసీపీ మంత్రులను నిలదీశారు.

ఇక భారతీ సిమెంట్స్ కి లాభం కలగాలని ఇతర సిమెంట్ కంపెనీలు అన్నింటికీ ధరలు పెంచడంతో  లబ్దిదారుల మీద 2100 కోట్ల రూపాయల భారం పడింది అని ఆయన ఎత్తి చూపారు. ఇళ్ళ స్థలాలకు అవసరమైన గ్రావెల్ ని అయిదు కిలోమీటర్ల మేర నుంచే ఇవ్వాలని నిబంధలను ఉండగా దానిని సవరించి మరీ జే గ్యాంగ్ దోచుకున్నారని నాగబాబు ఆరోపించారు.

జగనన్న ఇళ్ళ కాలనీలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్నది వాస్తవమని, దాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తానికి మొత్తం బయటపెట్టి కక్కిస్తామని నాగబాబు సవాల్ చేస్తున్నారు. మరో వైపు వైసీపీ మంత్రుల మీద ఆయన హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

జనసేన అధినేత ఎవరెవరితో మాట్లాడితే వైసీపీకి ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ మీద గౌరవంతో పిలిచి మాట్లాడితే ఉలిక్కి పడడం దేనికని ఆయన ప్రశ్నించారు. అక్కడ ఏమేమిటి మాట్లాడుకున్నరో చెప్పాలని మంత్రులు కోరడమేంటి అని ఆయన మండిపడ్డారు.

ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు ఒక మాట అంటున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జే గ్యాంగ్ అవినీతిని ఎండగడతామని జనంలో పెట్టి అంతా చూపిస్తామని. అంటే దాని అర్ధం వచ్చే ఎన్నికల్లో జనసేన పవర్ లో కి రావడం పవన్ సీఎం కావడం పక్కా అని జనసేన లెక్కలేసుకుంటోంది అని అంటున్నారు. ఆ దిశగానే కార్యాచరణ ఉంది అని అంటున్నారు. నాగబాబు మొత్తం విమర్శలలో ఇది కీలకమైన పాయింట్. ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే విషయం కూడా అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News