ఎవరు అడ్డుకుంటారో చూస్తాం-నాగబాబు

Update: 2020-01-21 05:19 GMT
సోమవారం మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో.. అసెంబ్లీ ముట్టడి కోసం ప్రయత్నించిన కేసులో అమరావతి రైతులు - మహిళలు అరెస్టయిన సంగతి తెలిసిందే. వీరిని పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. రెండేళ్ల విరామం తర్వాత మేకప్ వేసుకుని నిన్ననే పవన్ తన కొత్త సినిమా షూటింగుకి హాజరయ్యారు. ఐతే సాయంత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఆయన మంగళగిరికి చేరుకున్నారు. పార్టీ నేతలతో అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు. అనంతరం పోలీసులు అరెస్టు చేసిన వాళ్లు - వారి కుటుంబీకుల్ని కలవాలని పవన్ నిర్ణయించారు. ఐతే దీనిొకి పోలీసులు అడ్డు చెప్పారు. పవన్ నిన్న రాత్రే అమరావతి గ్రామాల పర్యలనకు సిద్ధం కాగా.. పోలీసులు అందుకు అంగీకరించలేదు. 

పర్యటనకు వెళ్లొద్దంటూ పోలీసులు అడ్డుకోవడంతో.. జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. పవన్‌ బయటకు వస్తే అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐతే అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన రైతులు - మహిళల్ని పోలీసులు అరెస్టు చేయడం.. గ్రామాల పర్యటనకు సిద్ధమైన పవన్‌‌ ను కూడా అడ్డుకోవడం అడ్డుకోవడంపై జనసేన నేత నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద నాగబాబు మాట్లాడుతూ..రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆందోళనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరు గర్హణీయం అన్నారు. మహిళా రైతులపై దాడి చేయడం ప్రభుత్వం చేసిన తప్పు అన్నారు. రైతుల పరామర్శకు తాము వెళ్తామని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని ఆయన సవాలు విసిరారు.


Tags:    

Similar News