పవన్ అంచనా తప్పా ?

Update: 2022-07-22 05:35 GMT
జనసేన నేతల్లో కొందరి వైఖరి చాలా విచిత్రంగా ఉంది. తాజాగా జరిగిన తిరుపతి టౌన్ బ్యాంకు పాలకవర్గం ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాదించింది. ఈ ఘన విజయం సాధించటంపై ప్రతిపక్షల నుండి అనేక ఆరోపణలు వినబడుతున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలను పక్కన పెట్టేస్తే క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా కొంత అలాగే ఉంది. వైసీపీ ఎంఎల్ఏ భూమన కరుణాకరరెడ్డి, ఆయన కొడుకు, తిరుపతి మున్సిపల్ డిప్యుటీ మేయర్ అభినయ్ రెడ్డి ఈ ఎన్నికను ఏకపక్షంగా చేసుకున్నారు.

ఎన్నికలో హోరాహోరీగా పోరాడుతున్నట్లు మొదట్లో కలరింగ్ ఇచ్చిన టీడీపీ చివరలో చేతులు ఎత్తేసింది. ఈ విషయమై స్వయంగా చంద్రబాబునాయుడే తిరుపతి నేతలపై మండిపోయారు.

మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మ,  తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్ తదితరుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సరే వీళ్ళ డ్రామాలను పక్కనపెట్టేస్తే ఇపుడు చర్చంతా జనసేన నేతలపైనే జరుగుతోంది. తాజా ఎన్నికల్లో జనసేన నుండి కనీసం ఒక్కటంటే ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

పార్టీకి ఇంతమంది నేతలుండి ఒక్క డైరెక్టర్ పోస్టుకు కూడా ఎందుకు నామినేషన్ వేయలేదో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇదే నేతలు ఈమధ్యనే సమావేశం పెట్టుకుని తమ అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి అసెంబ్లీలో పోటీచేస్తే లక్ష ఓట్ల మెజారిటితో గెలిపిస్తామని తీర్మానం చేశారు. అంతటితో ఆగకుండా ఇదే విషయాన్ని పవన్ కు విజ్ఞప్తిచేశారు.

పవన్ కూడా వీళ్ళ తీర్మానం, విజ్ఞప్తి నిజమే అనుకున్నారు. తీరా ఎందుకో అనుమానం వచ్చి సొంతంగా సర్వేచేయించుకుంటే బండారం బయడపడింది. ఆ బండారం ఇపుడు టౌన్ బ్యాంకు ఎన్నికలతో నిజమని తేలిపోయింది.

పవన్ కు నిజంగానే లక్ష మెజారిటి వచ్చేంత సీనే ఉంటే బ్యాంకు ఎన్నికల్లో నేతలు  ఎందుకని పోటీచేయలేదు ? బ్యాంకు ఎన్నికల్లో 57 వేల ఓట్లున్నాయి. నియోజకవర్గంలోని 2.4 లక్షల ఓట్లలో ఒక్క బ్యాంకు ఓట్లే 57 వేలంటే చిన్న విషయం కాదుకదా. జరిగింది చూసిన తర్వాత పవన్ కు నేతల కెపాసిటి ఏమిటో బాగా అర్ధమైపోయుంటుంది.
Tags:    

Similar News