ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న జనసేనాని పరిస్థితి చూస్తే.. జనసైనికులకు నవ్వాలో.. ఏడవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ పెట్టి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఆ పార్టీకి సంబంధించిన పని చేసే నేతలకు సంబంధించి పట్టుమని పది పేర్లు చెప్పమంటే నోరెళ్ల బెట్టే పరిస్థితి. మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా.. పవన్ కు రైట్ హ్యాండ్ గా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ మినహాయిస్తే మరే పేరు జనాల మనసుల్లో రిజిస్టర్ కాలేదనే చెబుతారు.
రాజకీయ పార్టీ అన్నంతనే కనీసం జిల్లాకు ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు కనిపిస్తారు. కానీ.. జనసేన మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. షెడ్యూల్ ప్రకారం ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని మీడియా సంస్థల అంచనాల ప్రకారం చూస్తే.. డిసెంబరులో ముందస్తుకు వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లుగా కథనాలు వచ్చేస్తున్నాయి. ఎలా చూసుకున్నా.. అయితే ఏడాది లేదంటే ఆర్నెల్లకు మించిన అసెంబ్లీ ఎన్నికలకు సమయం లేదనే చెప్పాలి.
దీంతో.. టికెట్ల పంచాయితీలు అప్పుడే మొదలయ్యాయి. పొత్తుల లెక్కలు కొలిక్కి తర్వాత..కనీసంప్రారంభం కాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు పలువురు.. ఎవరికి వారు తామే అభ్యర్థులమంటూ ప్రకటనలు ఇచ్చేసుకుంటున్నారు. ఇలాంటి వేళ.. పవన్ తో పొత్తులు పెట్టుకున్న వేళ పరిస్థితి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. జనసేన అభ్యర్థులుగా బరిలోకి దిగే వారి సంగతిని పక్కన పెడితే.. ఇప్పటికే పవన్ కు రైట్ హ్యాండ్ గా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ కు టికెట్ ఇవ్వలేని స్థితిలో పవన్ ఉన్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
దీనికి కారణం లేకపోలేదు. నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అలవాటుఉంది. ఆయన మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కూడా తెనాలి నుంచే. 2019లో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనకు పడిన ఓట్లు 30వేల కంటే తక్కువ. మొత్తం 2 లక్షల ఓట్లు పోల్ అయితే.. అందులో 14 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉండిపోయారు. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ గెలవగా.. టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్ 17వేల ఓట్లతో ఓడారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అలపాటిని పక్కన పెట్టేసి.. మూడో స్థానంలో నిలిచిన నాదెండ్ల మనోహర్ కు టికెట్ కేటయించే పరిస్థితి ఉండదు. అందునా.. తెనాలిలో స్థానిక రాజకీయాల్లో నాదెండ్ల మనోహర్ క్రియాశీలకంగా ఉన్నది లేదు. చివరకు ఆ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ జనసేన సత్తాను చాటి.. తనకెంత బలం ఉందన్న ప్రయత్నాన్ని నాదెండ్ల మనోహర్ చేసింది లేదు.
ఇలాంటి వేళ.. పొత్తుల్లో భాగంగా నాదెండ్ల కోసం తెనాలి టికెట్ ను చంద్రబాబు వదులుకోవటం సాధ్యమయ్యే పని కాదు. కావాలంటే.. ఎమ్మెల్సీని చేసి.. మంత్రిగా కేబినెట్ లోకి తీసుకునేందుకు చంద్రబాబు అంగీకరించొచ్చని చెబుతున్నారు. ఎంపీగా పోటీ చేసేందుకు అనువైన పరిస్థితి లేదు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం బాపట్ల లోక్ సభ స్థానం కిందకు వస్తుంది. అది ఎస్సీ రిజర్వు. తెనాలికి కాస్త దూరంలో ఉండే నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి.. తన సత్తా చాటేంత సీన్ ఉందా? అంటే సందేహమేనని చెబుతున్నారు. దీంతో.. ఈసారికి నాదెండ్లకు సీటు లేదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా జనసేనాని తన రైట్ హ్యాండ్ కు సైతం సీటు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ పరిస్థితికి మనోహర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.