వైసీపీ వీక్ నెస్ తో చెడుగుడు.... సేనానితో కష్టమేనా...?

Update: 2022-10-29 02:30 GMT
వైసీపీ అధికారంలో ఉంది. అలా ఇలా కాదు ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది దాకా ఎంపీలు చేతిలో ఉన్నారు. కేంద్రం మద్దతు కూడా ఉంది. ఇక ఏపీలో మరో అరడజన్ మంది ఎమ్మెల్యేలు మద్దతు కూడా వైసీపీకి ఉంది. శాసన మండలిలో తిరుగులేని మెజారిటీ ఉంది. ఒక విధంగా చూస్తే ఏపీలో వైసీపీదే రాజ్యం. ఆ పార్టీ చెప్పినే శాసనం. వైసీపీని ఎలా ఎదుర్కోవాలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పార్టీ టీడీపీకే అర్ధం కావడం లేదు. టీడీపీ రాజకీయ చరిత్రలో టఫ్ గా గడచింది బహుశా ఈ మూడున్నరేళ్ల కాలంలోనే.

మరి చంద్రబాబుకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. రాజకీయ అనుభవాలు వ్యూహాలు ఉన్నాయి. అయినా చంద్రబాబు బేలగా తన జీవిత కాలంలో ఎన్నడూ లేని విధంగా మీడియా ముందు ఏడ్చేశారు. జాలిగా బాబు గారు మారిపోయారు. ఆయన కానీ కుమారుడు లోకేష్ కానీ వైసీపీని ఎదుర్కోవడంలో ప్లాన్స్ వేస్తున్నా వైసీపీదే ఇప్పటిదాకా పైచేయిగానే ఉంది. అయితే ఒక్క ఎమ్మెల్యే జనసేనకు రికార్డుల ప్రకారం ఉన్నారు.

కానీ ఆ ఎమ్మెల్యే సైతం వైసీపీకి జై కొట్టారు. ఇక జనసేనాని పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు. పార్టీ నిర్మాణం పెద్దగా లేదు, కానీ ఫ్యాన్స్ రూపంలో ఎక్కడ చూసినా నిండుగా జనం ఉన్నారు. ఈ బలం బలగంతోనే పవన్ కళ్యాణ్ ఇపుడు వైసీపీ మీద మూడవ కన్ను తెరుస్తున్నారు. పవన్ వైసీపీ మీద గత ఎనిమిదన్నరేళ్లలో ఎన్నో విమర్శలు చేశారు. ఆవేశంగా ప్రసంగాలు చేశారు. కానీ ఈ మధ్య మంగళగిరి ఆఫీసులో ఆయన  అనుచితమైన భాష వాడి ఏకంగా చెప్పులు తీసి చూపించడం మాత్రం సెన్షేషన్ అయింది.

ఒక అధికార పార్టీ బలమైన పార్టీ మీదనే ఇలా చెప్పులు తీసి చూపించినా దానికి వైసీపీ నుంచి అనుకున్న స్థాయిలో కౌంటర్లు పడలేదు అనే అంటున్నారు. నిజానికి సినీ హీరోగా పవన్ కి ఉన్న గ్లామరే రాజకీయ పెట్టుబడి. ఆయనకు రాజకీయంగా ఎంత బలం ఉంది అన్నది 2024 ఎన్నికలు తేలుస్తాయి. కానీ పవన్ ఇలా పవర్ ఫుల్ ప్రభుత్వాన్నే ఢీ కొట్టి టీడీపీ వంటి పార్టీలకు కూడా షాక్ ఇచ్చేశారు. ఇక అధికార వైసీపీకి అయితే పవన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియడంలేదు అంటున్నారు.

ఒక విధంగా ఫస్ట్ టైం డిఫెన్స్ లో పడిపోయింది అంటున్నారు. టీడీపీ మీద ప్రయోగించిన ప్లాన్స్ పవన్ మీద అసలు వర్కౌట్ కావని తెలిసేసరికి చేతులు కాలాయి. అదే టైం లో పవన్ ఏపీలో వైసీపీని ఢీ కొట్టే మొనగాడిగా ఇటు రాజకీయ జనంలోనూ అటు సాదారణ జనంలోనూ కొత్త ఇమేజ్ సాధించారు. ఆయన మూడున్నరేళ్ళ విపక్ష పోరాటం ఎలా సాగినా ఈ దెబ్బతో టీడీపీ సమీపానికి పదడుగులు ముందుకు వేసుకుంటూ వచ్చేశారు. ఇపుడు పవన్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్  జనసేనకు శ్రీరామ రక్షగా ఉంది.

వైసీపీని ఎలా ఢీ కొట్టాలో పవన్ ని బాగా అర్ధమైపోయింది. తాను ఎంతలా రెచ్చినా రెట్టించినా వైసీపీ నుంచి సరైన కౌంటర్లు పడకపోవడంతో పవన్ ఇదే రూట్ లో జోరుగా  సాగుతారు అన్నది తేలిపోతున్న విషయం. ఇక పవన్ తన దూకుడు ద్వారా చాలానే ఆశిస్తున్నారు. తన అగ్రెస్సివ్ మోడ్ తో వైసీపీకి చుక్కలు చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో వైసీపీ ది కత్తి మీద సాము వ్యవహారం అని కూడా ఆయన గ్రహించగలిగారు అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి దూకుడు ఎంత చేసినా ఒక లెవెల్ దాటి వెళ్లలేదు.

అది దాటి వచ్చిందా వైసీపీకే దెబ్బ పడుతుంది. పవన్ని అరెస్ట్ లాంటివి చేసినా కూడా ఆయన ఇమేజ్ ఆకాశానికి అంటుతుంది. ఇప్పటికే విశాఖ ఎపిసోడ్ తో జనసేనాని ఇమేజ్ ని జాతీయ స్థాయికి పరిచయం చేసి బొక్క బోర్లా పడిన వ్యూహాలతో తల్లకిందులు అవుతున్న వైసీపీ పవన్ని ఇపుడు ఏ మాత్రం ఆపలేకపోతోంది. దాంతో పవన్ నోటి వెంట ఎలాంటి బాంబులు వస్తాయో అని వైసీపీలో టెన్షన్ అయితే ఉంది.

పవన్ చెప్పులు చూపిస్తూ కొందరు మంత్రులకు కాషన్ ఇచ్చినా వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోవడంలో వ్యూహాల లేమి ఉంది. ఆ వీక్ నెస్ నే చూసుకుని పవన్ చెడుగుడు ఆడేయడం ఖాయమని అంటున్నారు. ఎన్నికలు దగ్గర పెట్టుకుని పవన్ కి పూనకాలు తెప్పించిన పాపం వైసీపీది అయితే అంది వచ్చిన అవకాశాన్ని పట్టుకుని దూకుడు చేయడానికి రెడీ కావడం పవన్ మార్క్ పాలిటిక్స్. ఇక మంగళగిరిలో మరోసారి పవన్ పార్టీ సమావేశంలో రీ సౌండ్ కి రెడీ అవుతున్నారు. ఇక కాచుకోవడమే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News