ట్రెండ్‌ సెట్ చేస్తోన్న జూ జీన్స్‌

Update: 2016-07-09 12:43 GMT
ఈ ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో జీన్స్ వ‌స్ర్తాలు అనేది ఎంట‌ర్ అయ్యాక అది నాటి నుంచి నేటి వ‌ర‌కు ఎవ‌ర్‌ గ్రీన్‌ గానే ఉంటోంది. జీన్స్ ర‌క‌ర‌కాలుగా రూపాంత‌రాలు చెందిన జీన్స్‌ కు ఉన్న క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం జీన్స్‌ లో ర‌క‌ర‌కాల జీన్స్‌ ల గురించి విన్నాం. అయితే ఇప్పుడు ఓ స‌రికొత్త జీన్స్ మ‌న‌ముందుకు వ‌చ్చి కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. అదే జూ జీన్స్‌. విన‌డానికే విచిత్రంగా ఉన్న ఈ జూ జీన్స్‌ ను ఎవ‌రు డిజైన్ చేస్తారో తెలిస్తే మ‌రింత షాక్ అవుతాం.

 ఈ జూ జీన్స్‌ ను జూలో జంతువులు డిజైన్ చేస్తాయి. జంతువులు ఏంటి...జీన్స్‌ ను డిజైన్ చేయ‌డం ఏంట‌ని షాక్ అవ్వొద్దు. అస‌లు మ్యాట‌ర్ తెలుసుకుందాం. మ‌నం తెలుగులో వ‌చ్చిన న‌ట‌కిరీటీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఆ ఒక్క‌టీ అడ‌క్కు సినిమా చూసేఉంటారు. ఆ సినిమాలో బాగా న‌ష్టాల్లో ఉన్న ఓ వస్ర్తాల కంపెనీని రాజేంద్ర‌ప్ర‌సాద్ లీజుకు తీసుకుని డిఫ‌రెంట్‌ డిఫ‌రెంట్ వ‌స్ర్తాలు త‌యారు చేసి దాన్ని లాభాల భాట ప‌ట్టిస్తాడు. సిగరెట్లతో చొక్కాలకు చిల్లులు పెట్ట‌డం - పాన్ మ‌సాలా బాగా న‌మిలేసి డ్రెస్సుల‌పై ఊసేస్తే ఆ ష‌ర్టులు కొత్త రూపాంత‌రాలు సంత‌రించుకోవ‌డంతో వాటిని అమ్మి మ‌నోడు సినిమాలో భారీ లాభాలు సాధిస్తాడు.

 అయితే రాజేంద్రప్ర‌సాద్‌ను ఆ సినిమాలో కాపీ కొట్టారో లేదో ఓన్ ఐడియానో కాని జ‌పాన్ వాళ్లు ఇప్పుడు స‌రికొత్త‌గా జూ జీన్స్ ట్రెండ్‌ ను బాగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు జ‌పాన్‌ లో జూ జీన్స్ ట్రెండ్ జోరుగా ర‌న్ అవుతోంది. జూ జీన్స్‌ లో జీన్స్‌ ను చాలా వింత‌గా త‌యారు చేస్తారు. జీన్స్ ప్యాంట్లు త‌యారు చేసేందుకు వాడే ముడి వ‌స్ర్తాల‌ను పులులు - సింహాలు - ఎలుగుబంట్లు ఉన్న జూలో విసిరేస్తారు. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఈ వ‌స్ర్తాల‌ను ఫుట్‌ బాల్‌ - కారు - జీపు టైర్ల‌కు క‌ట్టి మ‌రీ వాటి మ‌ధ్య‌లో వేస్తారు. వాటిని జూలో ఉన్న జంతువులు వాటికి న‌చ్చిన‌ట్టుగా చింపిరి చింపిరిగా మార్చేస్తాయి.

   ఆ జంతువుల దెబ్బ‌కు ఆ వ‌స్ర్తాలకు ఓ స‌రికొత్త రూపం వ‌స్తుంది. త‌ర్వాత వాటితో మ‌ళ్లీ జీన్స్ ప్యాంట్లు - మోడ‌ల్ జీన్స్ ష‌ర్టులు త‌యారు చేస్తారు. ఈ వ‌స్ర్తాల‌ను జూ జీన్స్ పేరుతో మార్కెట్లోకి తీసుకువ‌స్తారు. వీటిని జ‌పాన్ యువ‌త ప్ర‌స్తుతం ఎగ‌బ‌డీ మ‌రీ కొంటోంద‌ట‌. ఇక ఈ వ‌స్ర్తాలు త‌యారు చేసేందుకు జంతువుల సాయం తీసుకున్నందుకు గౌర‌వంగా పులులు చింపిన డ్రెస్సుల‌కు టీ 1 - ల‌య‌న్స్ చించిన డ్రెస్సుల‌కు ఎల్ 1 బ్రాండ్స్ అని మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ ఉత్ప‌త్తులు త‌యారు చేస్తోన్న కంపెనీ వారు హిటాచీ త‌దిత‌ర న‌గ‌రాల్లో అమ్మ‌గా వ‌చ్చే లాభాల‌ను కొన్ని సామాజిక సంస్థ‌ల‌కు విరాళాలుగా కూడా ఇస్తూ త‌మ బ్రాండ్ల‌ను వారు ప్ర‌మోట్ చేసుకుంటున్నారు.
Tags:    

Similar News