యోగా.. ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశమే.. మన ప్రధాని నరేంద్రమోడీ దీన్ని విశ్వవ్యాప్తం చేశారు. దీంతో మన దేశంలో యోగా నేర్చుకుందామని చాలా మంది విదేశాల నుంచి వస్తున్నారు.
ఈ క్రమంలోనే హిమాలయాలు కొలువైన ఉత్తరాఖండ్ లో ఎందరో యోగాశ్రమాలు నెలకొల్పారు. అక్కడ ప్రకృతి ఒడిలో చాలామంది యోగాను నేర్చుకునేందుకు దేశవిదేశాల నుంచి వస్తున్నారు.
ఈ క్రమంలోనే యోగా నేర్చుకోవడానికి వచ్చిన ఓ జపాన్ మహిళలపై ముగ్గురు యోగా గురువులు కన్నేశారు. ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
జపాన్ కు చెందిన మహిళ రిషికేష్ లోని ఆమ్ బాగ్ ఏరియాలో గల యోగా స్కూల్లో యోగా నేర్చుకుంటోంది. ఆమెకు యోగా నేర్పిస్తున్న గురువులు హరికృష్ణ, చంద్రకాంత్, సోమ్ రాజ్ లు జపాన్ మహిళపై కన్నేశారు. తరచూ లైంగికంగా వేధించారు. తమతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చారు.
దీంతో విసుగు చెందిన సదురు మహిళ పోలీసులను ఆశ్రయించింది. శనివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం ముగ్గురు గురువులను అరెస్ట్ చేశారు.