మొన్న రియో ఒలింపిక్స్ లో ఇండియా తొలి పతకం అందించిన రెజ్లర్ సాక్షి మాలిక్.. బౌట్ అనంతరం సంబరాలు చేసుకుంటుంటే కోచ్ వచ్చి ఆమెను ఎత్తుకుని ఫ్లోర్ అంతా ఊరేగించాడు. కోచ్ లు ఇలా అథ్లెట్లను ఎత్తుకోవడం.. ముద్దాడటం లాంటివి మామూలే. కానీ కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడూ జరగనిది జరిగింది. జపాన్ రెజ్లర్ రిసాకో కవాయ్ తన బౌట్ గెలిచి స్వర్ణం సాధించిన అనంతరం ఎవ్వరూ ఊహించని విధంగా స్పందించింది. బౌట్ పూర్తయి తనను విజేతగా ప్రకటించే సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉద్వేగానికి గురైన రిసాకో.. తనను అభినందించడానికి వచ్చిన కోచ్ ను అమాంతం పైకెత్తి కింద కుదేసింది.
ప్రత్యర్థి రెజ్లర్లను ఎలా పల్టీ కొట్టిస్తారో అలాగే కోచ్ ను పల్టీలు కొట్టించింది. రెండుసార్లు అలా పల్టీలు కొట్టించిన రిసాకో అంతటితో ఆగకుండా కిందికి వంగి తన కోచ్ ను భుజాల మీదికి ఎత్తుకుంది. ఫ్లోర్ అంతటా అతణ్ని ఊరేగించింది. రిసాకో తత్వం గురించి కోచ్ కు ముందే అవగాహన ఉందేమో.. వాళ్లిద్దరూ ఇంతకుముందు కూడా ఇలాగే సంబరాలు చేసుకున్నారో ఏమో.. కోచ్ కూడా ఆమె చేసిందానికి ఆశ్చర్యపడలేదు. ఆమెకు బాగానే సహకరించాడు. వీళ్లిద్దరి సంబరాలు చూసి అక్కడున్న జడ్జీలు.. రిఫరీ.. ప్రేక్షకులు నవ్వుకుంటూ ఆస్వాదించారు. రిసాకో 63 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో స్వర్ణం సాధించింది. ఆమెకిదే తొలి ఒలింపిక్ స్వర్ణం.
Full View