మౌత్‌ వాష్‌ తో పుక్కిలిస్తే కరోనా తగ్గుతుందట..ఎవరు చెప్పారంటే ?

Update: 2020-08-12 00:30 GMT
కరోనా ..కరోనా ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా భారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. సామాన్యుల నుండి ప్రముఖులు , ప్రజాప్రతినిదులు కూడా కరోనా భారిన పడుతున్నారు. కరోనా ను అరికట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని చాలా దేశాల శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. తాజాగా రష్యా తోలి కరోనా వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసింది. ఈ విషయాన్నీ రష్యా అధినేత పుతిన్ స్వయంగా వెల్లడించాడు.

ఇక ఈ నేపథ్యంలో జర్మనీ కి చెందిన నిపుణులు మరో శుభవార్త చెప్పారు. మౌత్‌ వాష్ ‌తో పుక్కిలిస్తే నోరు, గొంతులోని కరోనా వైరస్‌ కణజాలం తగ్గుతోందని పరిశోధకులు తెలిపారు. ఫలితంగా స్వల్పకాలం ఇతరులకు కరోనా సంక్రమించే అవకాశం తగ్గుతుందని జర్మనీలోని రూర్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అయితే , మౌత్‌ వాష్ ‌ను ఉపయోగించి కరోనా పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదని వారు వివరిస్తున్నారు. సంక్రమణ వ్యాధుల జర్నల్‌ లో ఈ అధ్యయనం వివరాలను ప్రచురించారు. ముక్కు చీదడం, శ్వాస వదిలినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, దగ్గినప్పుడు వైరస్‌ బయటకు వస్తోందని ,మౌత్‌వాష్‌లతో నోటిని పుక్కిలించడం ద్వారా వైరస్‌ కణాల సంఖ్య తగ్గి సంక్రమణకు అవకాశాలు తగ్గిపోతున్నాయని వెల్లడించారు. జర్మనీలో లభ్యమయ్యే ఎనిమిది రకాల మౌత్‌వాష్‌లపై అధ్యయనం జరిపి ఈ వివరాలని వెల్లడించారు.
Tags:    

Similar News