బూమ్రా తాత గురించి తెలిస్తే షాకే!

Update: 2017-07-04 05:05 GMT
ప్ర‌తి ఇంట్లోనూ ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. అయితే.. సెల‌బ్రిటీ ఇళ్ల‌ల్లో జ‌రిగే ఉదంతాలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటాయి. తాజాగా అలాంటి ఉదంత‌మే ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌దునైన యార్క‌ర్ల‌తో డెత్ ఓవ‌ర్ల‌లో సైతం ప్ర‌త్య‌ర్థుల‌కు దిమ్మ తిరిగిపోయే షాకిచ్చే టీమిండియా పేస్ బౌల‌ర్ జ‌స్పీత్ బుమ్రా ఫ్యామిలీ విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.

బుమ్రా సొంత తాత తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల్లో కిందామీదా ప‌డుతూ ఆటో న‌డుపుతున్న వైనం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఉత్త‌రాఖండ్ లోని ఉధంసింగ్ న‌గ‌ర్ జిల్లా కిచ్చా ప‌ట్ట‌ణంలో 84 ఏళ్ల బుమ్రా తాత సంతోఖ్ సింగ్ ఉదంతం అనూహ్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. బీసీసీఐ గ్రేడ్ బి కాంట్రాక్టు ఆట‌గాడిగా ఉన్న బుమ్రాకు ఏడాదికి రూ.కోటి వేత‌నం.. ఇది కాక ఆడే ప్ర‌తి టెస్ట్‌కు రూ.15ల‌క్ష‌లు.. వ‌న్డేకు రూ.6 ల‌క్ష‌లు.. టీ20కి రూ.3ల‌క్ష‌లు ల‌భిస్తాయి. వీటితో పాటు ఐపీఎల్ త‌దిత‌ర ఆదాయ‌వ‌ర్గాలు ఉండ‌నే ఉన్నాయి.

మ‌రింత ఆదాయం ఉన్న‌ప్ప‌టికీ బుమ్రా తాత దారుణ‌మైన ఆర్థిక ఇబ్బందులు ప‌డుతూ.. 84 ఏళ్ల వ‌య‌సులో ఆటో న‌డ‌పాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌న్న సందేహం రాక మాన‌దు. అయితే.. కాల‌గ‌మ‌నంలో వెన‌క్కి వెళితే.. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భిస్తుంది.  

సంతోఖ్ సింగ్ కొడుకు జ‌స్బీర్ సింగ్‌. ఇంత‌కీ జ‌స్బీర్ సింగ్ ఎవ‌రంటారా? బుమ్రా తండ్రి. అయితే.. 2001లో బుమ్రా తండ్రి జ‌స్బీర్ సింగ్ మ‌ర‌ణించారు. దీంతో కోడ‌ల్ని.. మ‌న‌మ‌డ్ని త‌న ద‌గ్గ‌ర ఉంచుకోవ‌టానికి జ‌స్బీర్ సింగ్ అస్స‌లు ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో.. ఆమె ఇంట్లో నుంచి త‌న ఇంటికి వెళ్లిపోయారు. ఆ ఉదంతం గురించి ఇప్పుడు జ‌స్బీర్ సింగ్ మాట్లాడుతూ.. తాను అప్ప‌ట్లో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మ‌న‌న్నాని.. అప్ప‌ట్లో త‌న కోడ‌లు ఎంత బాధ ప‌డి ఉంటుందో అన్న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తారు. ప‌దేళ్ల కింద‌ట అహ్మ‌దాబాద్ నుంచి కిచ్చాకు వ‌చ్చాన‌ని.. ఆటోల బిజినెస్ చేశాన‌ని.. న‌ష్టాలురావ‌టంతో చివ‌ర‌కు తానే ఆటో న‌డ‌పాల్సి వ‌స్తుంద‌ని చెబుతాడు. ఏడేళ్ల కింద‌ట త‌న భార్య చ‌నిపోయింద‌ని చెప్పే బుమ్రా తాత‌.. ఇప్పుడు ఓ గ‌దిలో అద్దెకు ఉంటున్నాడు. గ‌డిచిన మూడు నెల‌లుగా అత‌ను ఇంటి అద్దె క‌ట్ట‌లేద‌ని తెలుస్తోంది. ఇక‌.. బుమ్రా తాత‌కు ఉన్న అతి ఖ‌రీదైన ఆస్తి ఏమైనా ఉందంటే.. అత‌డి రూమ్‌లో ఉండే పాత టీవీ మాత్ర‌మేన‌ని చెబుతారు. మ‌న‌మ‌డు ఆడే మ్యాచ్ టీవీలో వ‌స్తుందంటే.. అత‌డ్ని చూస్తూ కూర్చొండిపోతార‌ని చెబుతున్నారు. త‌ప్పులు చేయ‌టం మామూలే. ఆ త‌ప్పుల్ని క్ష‌మించి.. ముదిమి వ‌య‌సులో ఉన్న తాత‌కు బుమ్రా సాయంగా నిలుస్తారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News