ఇండియా - పాక్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉదృతంగా ఉన్న నేపథ్యంలో సైన్యాల కాల్పుల సంగతి కాసేపు పక్కనపెడితే మైకుల ముందు యుద్దాలు చేసేస్తున్నారు పాక్ పెద్దలు అనబడేవారు. సరిహద్దుల్లో కాల్పుల మోతల కంటే - వీరి మాటల రోతలు ఎక్కువైపోతున్నాయి. సెలబ్రెటీ అనే హోదాతో కొందరు ఈ విషయంలో చెలరేగిపోతున్నారు. సామరస్య పూర్వక పరిస్థితులకు - పెద్ద మనిషి స్థాయి మాటలకు ఎంతమంది స్పందించినా పర్లేదు కానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు మాత్రం అధికశాతం రెడీ అయిపోతున్నారు. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్న కొంతమంది నేతల సరసన తాజాగా జావేద్ మియాందాద్ చేరిపోయారు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్.. భార త్ పైనా - భారత ప్రధాని నరేంద్ర మోడీపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన మియాందాద్... భారత ప్రజలు మంచివళ్లే కానీ - నరేంద్ర మోడీలాంటి వ్యక్తులను అధికారంలో నుంచి తొలగించాలని చెబుతున్నాడు. ఈ అధిక తెలివి తేటల మాటలు ఇంకా కొనసాగుతూ... "భారత ప్రజలకు ఒక విషయం చెప్పదలచుకున్నాను.. మీ దేశంలో ఉన్న కొందరు వ్యక్తులు మిమ్మల్ని చంపగలరు.. మీరంతా కలసికట్టుగా ఉండి - అలాంటి వారికి వ్యతిరేకంగా పోరాడాలి.. క్రికెట్ ఆడే రోజుల్లో నేను చాలాసార్లు భారత్ కు వచ్చాను. అక్కడ సాధారణ ప్రజలు చాలా మంచివాళ్లు.. అయితే అదే ప్రజల్లో నరేంద్ర మోడీ వంటి వ్యక్తులు ఉన్నారు.. మేం యుద్ధానికి సిద్ధం! తాను ఎవరిని బెదిరిస్తున్నారో ఆయనకు తెలియడం లేదు.. పాకిస్థాన్ లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ సిద్ధంగా ఉన్నారు.." అని అంటూ భారతీయులు పిరికిపందలు - వాళ్లకు సైన్యం లేదు అని మియాందాద్ చెప్పుకొచ్చాడు.
కాగా, మియాందాద్ కు ఉన్న నొటి దురుసు ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. క్రికెట్ ఆడే రోజుల్లో కూడా మియాందాద్ తరచూ భారత్ క్రీడాకారులపై విషయంలో తన నోటి దురత తీర్చుకునేవాడు. 1992 ప్రపంచ కప్ లో భారత వికెట్ కీపర్ కిరణ్ మోరేపై తిట్ల పురాణం అందుకుని వార్తల్లోకి ఎక్కిన ఈ పాక్ మజీ క్రికెటర్, ఆస్ట్రేలియా పేసర్ డెన్నిస్ లిల్లీపైనా బ్యాట్ తో ఎగబడ్డాడు. తాజాగా భరతీయులపైనా - మోడీ పైనా ఇలా నోరు పారేసుకున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/