భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని వివిధ సందర్భాల్లో ఆయనకు బహుమతులుగా అందిన వస్తువుల ఈ-వేలం శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన భారత క్రీడాకారుల పరికరాలు, దుస్తులు కూడా వేలానికి ఉంచారు. ఈ క్రమంలో విశ్వక్రీడల్లో భారత్ తరఫున ఫెన్సింగ్ లో పోటీ పడ్డ తొట్టతొలి మహిళగా చరిత్ర సృష్టించిన భవానీ దేవి మరోసారి వార్తల్లో నిలిచింది. ఒలింపిక్స్ లో ఆమె ఉపయోగించిన కత్తి(ఫెన్స్)కి ఈ-వేలంలో విశేషమైన ఆదరణ లభిస్తోంది.
ఆమె కత్తిని రూ. 60లక్షల బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.10 కోట్లను దాటింది. పారాలింపిక్స్ లో స్వర్ణం పతక విజేత షట్లర్ కృష్ణ నాగర్, మరో షట్లర్ సుహాస్ యతిరాజ్ లు ఉపయోగించిన రాకెట్ ల ధర కూడా రూ.10 కోట్లకు చేరింది. తొలిసారిగా ఒలింపిక్స్‌లో పోటీ పడి ఒక రౌండ్లో గెలిచి రెండో రౌండ్లో ఓటమి పాలైన తమిళనాడు ఫెన్సర్ భవానీ దేవి ఇటీవల మోడీని కలిసిన సందర్భంగా బహుకరించిన కత్తికి రూ.10 కోట్ల రేటు పలికింది. అలాగే పారాలింపిక్స్ లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన కృష్ణ నగార్ మోడీకి ఇచ్చిన రాకెట్ కూడా వేలంలో రూ.10 కోట్లు దక్కించుకుంది. ఇదే ఈవెంట్లో రజతం నెగ్గిన సుహాస్ యతిరాజ్ రాకెట్ సైతం రూ.10 కోట్ల రేటు పలికింది. భవానీ కత్తి బేస్ ప్రైస్ రూ.60 లక్షలు కాగా.. కృష్ణ రాకెట్ ప్రాథమిక ధర రూ.80 లక్షలు. సుహాస్ రాకెట్ బేస్ ప్రైస్ రూ.50 లక్షలు.
టోక్యో ఒలింపిక్స్ లో దేశానికి తొలి స్వర్ణం అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఉపయోగించిన ఈటెను రూ. కోటి బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.10కోట్ల వద్ద కొనసాగుతోంది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా ఒలింపియన్ గా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు రాకెట్ కు రూ. 80లక్షల బేస్ ధరతో వేలం నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం రూ. 9 కోట్లు దాటింది. కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక వెబ్ సైట్ లో (pmmementos.gov.in) ఈ వేలం ఇవాల్టి నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ వేలం ద్వారా సమకూరే నిధులను నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు. ఐతే ఈ వేలం ఇంకా కొనసాగుతుండటంతో ఫైనల్ రేటు ఇంకా నిర్ణయం కాలేదు.