బిగ్ బి. దేశ ప్రజలకు ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఒకప్పుడు సంపన్నుడిగా ఉన్న ఆయన తర్వాతి కాలంలో చేపట్టిన వ్యాపారంతో పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయి.. వాటిని తీర్చేసిన వైనం అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఇంతకీ బిగ్ బి ఆస్తి ఎంత? అంటే.. సమాధానం ఎవరూ చెప్పలేని పరిస్థితి.
ఇకపై అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే.. బిగ్ బి సతీమణి.. సీనియర్ నటి జయాబచ్చన్ తాజాగా తన ఆస్తివివరాల్ని ప్రకటించారు. తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్ వాది పార్టీ తరఫున ఎంపీగా రాజ్యసభ బరిలో దిగనున్న ఆమె తన నామినేషన్లో తన ఆస్తివివరాల్ని వెల్లడించి అందరూ అవాక్కు అయ్యేలా చేశారు.
ఎందుకలా అంటే.. ఆమె తన ఆస్తి విలువను రూ.వెయ్యి కోట్లుగా చూపించారు. తన భర్త అమితాబ్ తో కలిసి తమ వద్ద రూ.62 కోట్ల విలువైన బంగారం ఉందని ఆమె వెల్లడించారు. అంతేకాదు.. తాను వెల్లడించిన వెయ్యి కోట్ల ఆస్తులకు సంబంధించిన లెక్కల్ని ఆమె చూపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2012లో రాజ్యసభకు నామినేషన్ వేసిన సందర్భంగా జయాబచ్చన్ తన ఆస్తుల్ని రూ.493 కోట్లుగా చూపించారు. ఐదేళ్ల వ్యవధిలో ఆమె ఆస్తి రెట్టింపు కావటం గమనార్హం.
జయాబచ్చన్ తాజాగా ప్రకటించిన ఆస్తి లెక్కల ప్రకారం ఆమె రాజ్యసభలోనే అత్యంత సంపన్నురాలిగా నిలిచినట్లు చెప్పాలి. ఇక.. ఆమె వెల్లడించిన ఆస్తుల్లో ముఖ్యమైన వివరాలు చూస్తే..
+ బంగారు రూ.62 కోట్లు
+ రూ.15 కోట్లు విలువ చేసే 11 కార్లు.
+ రోల్స్ రాయిస్.. మూడు మెర్సిడెస్.. ఒక ఫోర్డ్.. రేంజ్ రోవర్.. టాటా నానోతో పాటు ఒక ట్రాక్టర్
+ ఫ్రాన్స్ లోని బ్రిగ్నోగాన్ ప్లేగ్ లో 3175 చదరపు గజాల విస్తీర్ణంలో భవనం
+ నొయిడా.. భోపాల్.. ఫూణే.. అహ్మదాబాద్.. గాంధీనగర్ లో ఆస్తులు
+ రూ.9 లక్షల విలువైన పెన్ను అమితాబ్ దగ్గరుంది
+ జయాబచ్చన్ కు లక్నోలోని కేరీలో రూ.2.2 కోట్ల విలువైన 1.22 హెక్టార్ల వ్యవసాయ భూమి
+ అమితాబ్ కు బరాబంకీ జిల్లా దౌల్తాపూర్ లో రూ.5.7 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమి