అసలే అమ్మ. అందులోకి ఎన్నికల కాలం. అమ్మ.. అనుగ్రహం ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని చూస్తేనే తెలుస్తుంది. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తన సంక్షేమ కార్యక్రమాల్ని మరింత వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది.
నిన్నటి వరకూ సబ్సిడీ మీద మినరల్ వాటర్ బాటిళ్లలో తాగు నీరును అందిస్తున్న జయసర్కారు తాజాగా ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ రూ.10కు 20 లీటర్ల బాటిల్ ను ఇచ్చేవారు. ఇకపై.. ఆ బాటిల్ ను రోజుకొకటి చొప్పున ఉచితంగా అందజేయనున్నారు. స్మార్ట్ కార్డు సాయంతో.. పేదలకు మినరల్ వాటర్ బాటిళ్లను ఉచితంగా అందించాలని అమ్మ తీసుకున్న నిర్ణయంపై తమిళ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలు జరిగే నెల గురించి చూచాయిగా ఎన్నికల సంఘం ప్రకటన చేస్తే.. దానికే ఇంత నిర్ణయం తీసుకుంటే.. ఎన్నికల గంట కొట్టే నాటికి మరెన్ని సంక్షేమ పథకాల్ని అమ్మ తెరపైకి తీసుకొస్తారో? ఏది ఏమైనా సంక్షేమ పథకాలతో ఈసారి ఎన్నికల్లో గట్టెక్కాలనుకుంటున్న అమ్మ రానున్న రోజుల్లో మరిన్ని తాయిలాలు ప్రకటించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.