‘అమ్మ’ అంకెల్ని ఎంతగా నమ్ముకుందంటే..

Update: 2016-05-17 06:16 GMT
రాజకీయ నాయకులకు నమ్మకాలు ఎక్కువన్న సంగతి తెలిసిందే. సంఖ్యాశాస్త్రం పట్ల.. వాస్తు మీద వారికుండే నమ్మకం.. భయభక్తులు.. ప్రజలు మీద కూసింత ఉన్నా కానీ పరిస్థితి మరోలా ఉండేదేమో. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంకెల్ని ఎంతగా నమ్ముకున్నారో తాజా ఉదంతం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సంఖ్యాశాస్త్రం మీద విపరీతంగా గురి ఉండే అమ్మ.. చివరకు ఓటు వేసే విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉన్నారో చూస్తే ఆశ్చర్యపోకమానదు.

అమ్మకు కేథడ్రల్ రోడ్డులోని స్టెల్లా మేరీస్ కాలేజీ పోలింగ్ కేంద్రం పరిధిలో అమ్మకు ఓటు ఉంది. ఇక్కడ మొత్తం 1258 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితాలో అమ్మ నెంబరు 1100. మొత్తాన్ని కూడితే వచ్చేది ‘‘2’’.

ఇక.. సోమవారం ఓటేసిన అమ్మ ‘‘200’’ ఓటరుగా ఓటేశారు. ఇక్కడా ‘‘2’’మిస్ కాకుండా చూసుకున్నారు. ఇక.. అమ్మ ఓటేసిన టైం చూస్తే.. ఉదయం ‘‘9.56’’గంటలు. ఈ మొత్తం కలిపితే వచ్చేది ‘‘20’’. ఇక్కడా.. ‘‘2’’ తప్పకుండా చూసుకున్నారు. మరి.. ఇన్ని ‘‘2’’లను నమ్ముకున్న అమ్మకు కాలం కలిసి వస్తుందో లేదన్నది మరో ‘‘2’’ రోజుల్లో తేలనుండటం గమనార్హం.
Tags:    

Similar News