అప్పటివరకు బాగానే ఉండి.. ఒక మోస్తరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి.. సుదీర్ఘ కాలం అక్కడే గడిపి.. చివరకు అనూహ్యంగా మరణించిన ముఖ్యమంత్రి అన్నంతనే గుర్తుకు వచ్చేది జయలలితే. మీడియాలో రిపోర్టు అయిన కథనాల్ని చూస్తే.. ఒక అర్థరాత్రి సమయంలో జయలలిత హైఫీవర్ తో బాధపడుతుండటంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చినట్లుగా వార్తలు రావటం.. కట్ చేస్తే కొన్నాళ్లకు ఆమె మరణించిన వార్తలు రావటం తెలిసిందే. సజీవంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరితే వారాల తరబడి సాగిన వైద్యం అనంతరం నిర్జీవంగా ఆమె బయటకు వచ్చారు.
ఆమె మరణంపై బోలెడన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆమెది సహజ మరణమేనా? అసలు అపోలో ఆసుపత్రిలో వైద్య సేవలు సరిగా అందాయా? లాంటి ప్రశ్నలతో పాటు.. ఊహాకల్పిత ప్రచారాలు బోలెడన్ని సాగాయి.
అమ్మకు అత్యంత విధేయుడిగా ఉంటే పన్నీర్ సెల్వం సైతం ఆమె మరణంపై సందేహాల్ని వ్యక్తం చేయటం తెలిసిందే. అలాంటి వేళ.. నాటి సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఒక కమిషన్ ను నియమించారు. విశ్రాంతి న్యాయమూర్తి ఆర్ముగస్వామి ఏర్పాటు చేసిన కమిషన్.. జయలలిత మరణంపై పలువురిని విచారించింది.
ఈ క్రమంలో ఎయిమ్స్ వైద్యుల టీం కూడా మూడు పేజీల నివేదికను సమర్పించారు. ఇందులో అమ్మ అరోగ్యం గురించి.. ఆమె అనారోగ్యానికి కారణమైన పరిస్థితులతో పాటు.. ఆసుపత్రిలో ఆమెకు జరిగిన వైద్యం గురించిన వివరాల్ని పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్న సమయంలో ఆమె ద్రాక్ష.. స్వీట్లు.. కేక్ లు తినటంతో ఆమె ఆరోగ్యం సెప్టెంబరు 28 నాటికి మరింతగా దిగజారినట్లుగా పేర్కొన్నారు. ఊపిరితిత్తుల సమస్య తలెత్తటంతో అక్టోబరు 7న ట్రాకియోస్టమీ చికిత్సను మొదలు పెట్టినట్లుగా తెలిపారు.
ఆమెకు లండన్ వైద్యుడు రిచర్డ్ బిలే.. అపోలో ప్రత్యేక వైద్యులు.. ఎయిమ్స్ వైద్యులు చికిత్సను అందించారు. డిసెంబరు 3న ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించటం.. నాలుగో తేదీ నాటికి శ్వాస తీసుకోవటానికి కూడా ఇబ్బంది పడ్డారన్నారు. దీంతో ఎక్మోను ఏర్పాటు చేసి పర్యవేక్షించినట్లుగా పేర్కొన్నారు.
ఐదో తేదీన మెదడు.. గుండె పని చేయలేదని వైద్యులు నిర్దిస్తూ.. అపోలో ఆసుపత్రిలో జయలలితకు జరిగిన వైద్యంలో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. ఇంతకూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే వేళలో ద్రాక్ష.. స్వీట్లు.. కేక్ లను అనుమతించటం ఎలా? ఆమె ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉంటే.. వాటిని ఎందుకు నియంత్రించలేదు? లాంటి ప్రశ్నలు ఈ రిపోర్టు వివరాల్ని చూడగానే మదిలో మెదలటం ఖాయం.