తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి - అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రకటించిన మేనిఫెస్టో రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మనిషి పుట్టింది మొదలు వారు ఎదిగి - తమ వ్యవహారాలను చక్కబెట్టుకునే వరకు అన్నీ ఫ్రీ - ఫ్రీ అంటూ అమ్మ ప్రకటించేశారు. అయితే అమ్మ హామీలు విలువ లక్ష కోట్ల పైబడి ఉందని తేలింది.
ఈ సారి ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తే.. మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ఉచిత హామీలను నెరవేర్చేందుకు ఆమె ఏకంగా 1.14 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 2 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. జయలలిత ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారంగా…అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి వస్తే ఐదేళ్ళలో మొత్తం ఉచిత హామీల అమలు కోసం రూ.1.14 లక్షల కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది.
ఈ మొత్తం తెలుగు రాష్ర్టాల వేర్వేరు బడ్జెట్ విలువతో దాదాపు సమానం కావడం ఆసక్తికరం. ఇదిలాఉండగా...జయ ప్రయోగించిన అమ్మ ఉచిత హామీలతో విపక్ష నేతలను గందరగోళంలో పడేస్తోంది. ప్రధానంగా మహిళా ఓటర్లనే లక్ష్యంగా చేసుకుని జయలలిత మేనిఫెస్టోను తయారు చేశారు.