అమ్మ నిక్షేపంగా ఉంది

Update: 2015-07-15 20:54 GMT
తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి..అమ్మగా కొలిచే అరాధ్య దైవం జయలలితకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదన్న విషయంపై స్పష్టత రావటంతో పాటు.. ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదన్న భావన కలిగేలా చేసింది.

కాలేయానికి సంబంధించిన అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురికావటంతో పాటు.. ఆమెను ఏ క్షణంలో అయినా ప్రత్యేక విమానంలో సింగపూర్ కు తరలించి.. ప్రత్యేకంగా  శస్త్ర చికిత్స చేయనున్నారన్న వార్తలు వచ్చాయి.దాదాపుగా పది రోజుల నుంచి ఆమె సచివాలయానికి గైర్హాజరు కావటంతో ఆమె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎంత మాత్రం లేవన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది.

బుధవారం ఉదయం సెక్రటేరియట్ కు వచ్చిన జయలలిత.. తన రోజువారీ పనుల్లో తలమునకలయ్యారు. దీంతో.. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యా లేదన్న విషయం తేలిపోయింది. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల్లో ప్రొఫెసర్లుగా నియమితులైన 1006 మందిలో ఒక ఐదుగురికి నియమక ఉత్తర్వులు చేతికి అందించారు. తాజా కార్యక్రమాల నేపథ్యంలో.. తమిళ విపక్షాలు ఆరోపించినట్లుగా జయలలిత ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి విషయం లేదని.. అమ్మ నిక్షేపంగా ఉందని తేలిపోయింది.
Tags:    

Similar News