అమ్మ మృతితో ఆమె వారసత్వం చేజిక్కించుకోవటానికి సాగుతున్న ప్రయత్నాల్లో కొత్త కోణం బయటకు వచ్చింది. అన్నాడీఎంకే చీఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. తానే ఆమె రాజకీయ వారసురాలంటూ అపోలో ఆసుపత్రి వద్ద హడావుడి చేసిన సంగతి తెలిసిందే. మీడియా ముందుకు వచ్చిన ఆమె.. అమ్మ తమ కుటుంబ సభ్యురాలని.. ఆమెను కలుసుకోకుండా తనను ఎందుకు ఆపుతారంటూ భద్రతా సిబ్బందిని దీప అప్పట్లో ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై కాస్తంత హడావుడి జరిగిన తర్వాత.. ఆమెను లోపలికి అనుమతించారు. అయితే.. అమ్మ వద్దకు ఆమె వెళ్లలేదనే చెబుతారు. తాజాగా అమ్మ అంతిమ సంస్కారాల్ని శశికళ పూర్తి చేయటంపై దీప తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ అంత్యక్రియలు నిర్వహించటం తాను ఎప్పుడూ చూడలేదన్న ఆమె.. జయలలిత మరణంలో చాలానే అంతరంగిక విషయాలు ఉన్నట్లుగా వెల్లడించారు.
త్వరలోనే తాను నోరు విప్పి.. చాలా విషయాలు బయటపెట్టనున్నట్లుగా ఆమె వెల్లడించారు. అమ్మ సొంత అన్న కూతురే దీప. నిజానికి అమ్మతోనే వారు ఉండేవారు. తర్వాతి కాలంలో జయతో వచ్చిన తగాదాలతో వారుబయటకు వెళ్లిపోయారు. అయితే.. పోయెస్ గార్డెన్ లో ఉన్న సమయంలోనే దీప జన్మించారు. రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చిన తర్వాత నుంచి.. వారిని అమ్మ దూరం పెట్టారు. 2013లో తన అన్న భార్య (వదిన) చనిపోయినప్పుడు కూడా అమ్మ వెళ్లలేదు. తర్వాత మేనకోడలి పెళ్లి జరిగిన జయలలిత వెళ్లలేదు. అయితే.. తన ఇంటికి వచ్చిన నూతన దంపతుల్ని ఆశీర్వదించిన ఆమె.. దీపకు ఒక ఫ్లాట్ బహుమతిగా ఇచ్చినట్లుగా చెబుతుంటారు.ప్రస్తుతం భర్తతో దూరంగా ఉంటున్న దీప.. అమ్మకు అసలుసిసలు వారసురాలిగా మారేందుకు విపరీతంగా ప్రయత్నాలు షురూ చేయటం గమనార్హం.