నమ్మకాలకు పెద్ద పీట వేసే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. ఐదోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ నమ్మకానికి పెద్ద పీట వేశారు. ఆమె వేసిన ప్రతి అడుగులోనూ నమ్మకం కొట్టొచ్చినట్లు కనిపించింది. సెంటిమెంట్లకు అమితంగా ప్రాధాన్యం ఇచ్చే అమ్మ.. తన ప్రమాణస్వీకారం సందర్భంగా జ్యోతిష్కుల సూచన ప్రకారం నడుచుకున్నట్లు చెబుతున్నారు.
జ్యోతిష్యులు పెట్టిన ముహుర్తమైన ఉదయం 10.37 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన ఆమె.. ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నారు. అంతేకాదు.. ఆమె వేలికి పచ్చ ఉంగరం కొట్టొచ్చినట్లు కనిపించింది.
ప్రమాణస్వీకారం చేసిన వేదిక వెనుక కూడా పెద్ద పచ్చ బ్యానర్ పెట్టారు. ఇక.. ప్రమాణస్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ ఆమె సంతకం చేసిన పెన్ను సైతం పచ్చది కావటం గమనార్హం. మొత్తంగా తన ప్రమాణస్వీకారంలో పచ్చదనానికి అమ్మ పెద్ద పీట వేశారు. మరి.. ఇంతగా నమ్ముకున్న నమ్మకాలు.. సెంటిమెంట్లు అమ్మకు ఎంత మేరకు అక్కరకు వస్తాయో చూడాలి.