అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు.. తీవ్ర అనారోగ్యమన్న విషయం తర్వాత అందరికి అర్థమైంది. గత నెల 22న ఆసుపత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక దశలోఅమ్మ కోమాలోకి వెళ్లినట్లుగా దుష్ప్రచారం సాగింది. అయితే.. అందుకు భిన్నంగా అమ్మ కోలుకోవటమే కాదు.. ప్రస్తుతం తన పని తాను చేసుకోవటంతో పాటు.. పాలనా వ్యవహారాల్లోనూ ఆమె పాలు పంచుకుంటున్నారన్నది తాజా సమాచారం.
ఆసుపత్రిలో ఉన్న ఆమె పాలన ఎలా సాధ్యమన్న డౌట్ రావొచ్చు. కానీ.. దానికి మార్గం లేకపోలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. అమ్మ ఎలా పాలిస్తున్నారన్న విషయాన్ని కొందరు ముఖ్యులు తమ సన్నిహితులతో పంచుకోవటంతో.. ఈ విషయం బయటకు వచ్చినట్లుగా చెప్పొచ్చు. ఆ మధ్యన వెంటిలేటర్ మీద అమ్మను ఉంచినప్పుడు.. ఆ ఏర్పాట్లలో అమ్మ గొంతుకు గాయమైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె పెద్దగా మాట్లాడలేకపోతున్నారని.. అందుకే.. ల్యాప్ టాప్ సాయంతో తాను చెప్పాల్సిన విషయాల్ని చెబుతున్నారని.. కొన్ని విషయాల్ని మాత్రం లోగొంతుకతో తన ఆప్త మిత్రురాలు.. నెచ్చలి శశికళకు చెప్పటం.. తనకు అత్యంత నమ్మకస్తురాలైన ఐఏఎస్ అదికారితో వివరాలు చెప్పటం ద్వారా.. ఆమె పాలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తనను దీపావళికి ముందే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని అమ్మ కోరిన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే.. ఆమె కోరిక అమలు సాధ్యం కాదని వైద్యులు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో పది రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉందని.. అది తప్పదన్న విషయాన్ని లండన్ వైద్యులు డాక్టర్ రిచర్డ్ బీలే స్పస్టం చేసినట్లుగా తెలుస్తోంది. తన డిశ్చార్జ్ మీద అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. కానీ.. అది సాధ్యం కాకపోవటంతో నిరాశలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. అమ్మ ఆరోగ్యం మెరుగుపడటమే కాదు.. బెడ్ మీద నుంచే పాలనను చేస్తుండటం విశేషంగా చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/