తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీరు కాస్త భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె తీసుకునే నిర్ణయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కొన్నిసార్లు అయితే షాకింగ్ గానూ ఉంటాయి. తనను అభిమానంతో పిలుచుకునే పేరును ఒక బ్రాండ్ గా మార్చుకొని సంక్షేమ పథకాలకు సరికొత్త అర్థాన్ని ఇచ్చే రీతిలో ఆమె వ్యవహరించిన వైనం ప్రత్యేకంగా చెప్పాల్సిందే.
అలాంటి ఆమె.. ఇప్పుడు ఎన్నికల్ని ఎదుర్కోనున్నారు. ఐదేళ్ల కిందట పవర్ లోకి వచ్చిన ఆమె.. అప్పటి నుంచే ఈ ఎన్నికల కోసం ప్లాన్ చేయటం షురూ చేశారు. అందులో భాగంగానే ‘అమ్మ’ పేరును బ్రాండ్ గా ప్రమోట్ చేసి.. భారీగా కార్యక్రమాలు చేపట్టారు. తమిళనాడులో జరిగే ఎన్నికల్లో అధికారపక్షానికి రెండోసారి అధికారం చేజిక్కించుకునే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అలాంటిది మరోసారి రిపీట్ చేసి చరిత్ర సృష్టించాలన్నది అమ్మ ఆశ. అందులో భాగంగా ఆమె భారీ వ్యూహాన్నే సిద్ధం చేశారు.
తాజాగా.. జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే అభ్యర్థులు.. తాము పోటీ చేయాలని భావిస్తున్న స్థానాలకు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ జరిగే స్ర్కీనింగ్ లో పాస్ అయితే సరిపోదు. అంతకు మించిన అగ్నిపరీక్ష ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుంది. పార్టీ అధినేత్రి జయలలిత.. టిక్కెట్టు కోరుకుంటున్న నేతను ఇంటర్వ్యూ చేస్తారు. ఇందులో సక్సెస్ అయిన వారికి మాత్రమే టిక్కెట్టు లభించే అవకాశం ఉంది. ఈ తరహాలో అభ్యర్థుల్ని ఎంపిక చేసుకునే ధైర్యం ఎంతమంది అధినేతలకు ఉంది? ఏమైనా అమ్మ.. అమ్మే.