ప్రభుత్వాధినేతలంటే లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటారు.. అంతేకాదు.. శాసనసభల్లో తీర్మానాలు చేసుకుని మరీ తమ జీతాలు భారీగా పెంచుకుంటున్న నేతలూ ఉన్నారు. కానీ... జయలలిత మాత్రం తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా కేవలం నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకునేవారు.
నిజానికి ఆమె సీఎం అయిన తొలి నెలలోనే తనకు జీతం వద్దని చెప్పారు. తన జీవనానికి సరిపడా ఆదాయ వనరులు తనకు ఉన్నాయని... తనకు జీతం అవసరం లేదని ఆమె ప్రకటించారు. కానీ.. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తప్పనిసరిగా జీతం తీసుకోవాలి. అందుకు గాను ఆమె జీతం అవసరం లేదన్న నిర్ణయాన్ని సడలిస్తూ కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె మరణించేవరకు అదే పాటిస్తూ నెలకు కేవలం ఒక్క రూపాయి జీతమే తీసుకునేవారు. ఇండియాలో ఇంకే సీఎం కూడా అలా చేయలేకపోయారు.
జయ తరువాత త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ఒక్కరే ఇలా జీతం విషయంలో ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే... ఆయన జయలా ఒక్క రూపాయి జీతంకు పరిమితం కాకుండా తన జీతం తాను తీసుకుంటూనే దాన్ని పేదల కోసం ఖర్చు చేస్తుంటారు. కమ్యూనిస్టు నేత అయిన మాణిక్ సర్కార్ ఆస్తులు గట్టిగా మూడు లక్షల లోపే. 1998 నుంచి ఆయన త్రిపురకు సీఎంగా ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/