నమ్మకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలత సండే వర్క్ చేయనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత శనివారం.. ఐదోసారి ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆమె.. పదవీ బాధ్యతలు చేపట్టిన రెండో రోజు పని చేయకుండా ఉండరాదని.. అధికార కార్యకలాపాలకు ద్వితీయ విఘ్నం కలగకూడదన్న ఉద్దేశ్యంతో ఆదివారం కూడా పని చేయాలని నిర్ణయించారు.
ఈ కారణంతో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆమె తమిళనాడు సచివాలయానికి రానున్నారు. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ నేతలు.. అధికారులు సిద్ధం కానున్నారు. ఏదైనా పనిని ప్రారంభించిన సందర్భంలో రెండో రోజు కూడా పని చేయటం రివాజే. అందులో భాగంగానే జయలలిత ఆదివారం పని చేస్తున్నారని చెబుతున్నారు.
ఇక.. అమ్మ ప్రతిష్ఠాత్మకం చేపట్టిన అమ్మ క్యాంటీన్లను ఆదివారం మరిన్ని ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. అమ్మ పేరును బ్రాండ్‌గా మార్చి దూసుకువెళుతున్న విషయం తెలిసిందే.
పేదలకు ఎంతో ఆదరవుగా నిలుస్తున్న అమ్మ క్యాంటీన్లను మరిన్ని తెరిచేందుకు అన్నా డీఎంకే సర్కారు ప్లాన్ చేసింది. అమ్మ బ్రాండ్‌లతో పేదలకు.. అల్పాదాయ వర్గాలకు అండగా నిలుస్తున్న అన్నాడీఎంకే సర్కారు.. వాటితో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోంది.