ఆల్ ద బెస్ట్ చెప్పారు కానీ అమ్మ రావట్లేదు

Update: 2015-10-21 06:09 GMT
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున పిలిచినప్పటికీ.. పలువురు ముఖ్యనేతలు ఏదో ఒక అంశాన్ని చెప్పి రావట్లేదు. తాజాగా ఆ జాబితాలో తమిళనాడు ముఖ్యంత్రి జయలలిత కూడా చేరిపోయారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను ఆహ్వానించారు.

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కు అభినందనలు తెలిపిన ఆమె.. బాబు ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా ఏపీ రాజధాని నిర్మాణం సాగాలని అభిలాషను వ్యక్తం చేసిన ఆమె.. బాబుకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

కొత్త రాజధాని కోసం చంద్రబాబు చేస్తున్న కృషి.. మంచి ఫలితాలు అందించాలని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్ని చెప్పిన ఆమె.. చివరకు తాను రావట్లేదన్న విషయాన్ని చెప్పేశారు. అనివార్య కారణాల వల్ల తాను శంకుస్థాపన కార్యక్రమానికి రావట్లేదని తేల్చేశారు. సీమాంధ్రులు రాజధాని కట్టుకోవటం తమిళులకు ఇష్టం లేదా? ఏమిటన్న వ్యాఖ్యలు వినిపించటం గమనార్హం.
Tags:    

Similar News