అలనాటి అందాల నటి - మాజీ ఎంపీ జయప్రద విజయవాడలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబును కలిసేందుకు ఆమె రావడంతో అక్కడున్న టీడీపీ నాయకులంతా ఆసక్తిగా చూశారు. ఒకప్పుడు టీడీపీలోనే ఉండి పదవులు - ప్రాధాన్యం అందుకున్న ఆమె ఉత్తరాదికి తరలిపోయారు. టీడీపీని వీడి సమాజ్ వాది పార్టీలో చేరిన ఆమె ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా గెలిచారు. అమర్ సింగ్ తో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం... అమర్ సింగును సమాజ్ వాది పార్టీ బయటకు గెంటేయడంతో ఆమె కూడా అమర్ సింగుతో పాటు సమాజ్ వాది నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మొన్నటి ఎన్నికల్లో మళ్లీ ఆమె తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేయాలని కూడా భావించారు. కానీ ఎవరూ ఆమెను చేర్చుకోలేదు. ఎన్నికల తరువాత కూడా రెండు రాష్ట్రాల్లోనూ వివిధ పార్టీల నేతలను ఆమె సంప్రదించారు. అయితే... తాజాగా ఆమె రాకకు మాత్రం కారణం వేరు.
విజయవాడలోని చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి జయప్రద రావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. అయితే, ఆమె రాజకీయ కారణాలతో అక్కడు రాలేదు. ఈ నెల 27న జయప్రద కుమారుడు సిద్ధార్ధ్ వివాహం జరగనుండడంతో అందుకు చంద్రబాబును ఆహ్వానించందుకు ఆమె వచ్చారని చెబుతున్నారు. రెండు రోజుల కిందట ఆమె హైదరాబాద్ లో తెలంగాణ సీఎం చంద్రశేఖరరావును కూడా కలిసి పెళ్లికి ఆహ్వానించారు. అయితే... చంద్రబాబు ఊ అంటే టీడీపీలోకి వచ్చేందుకు జయప్రద సిద్ధంగా ఉందని సమాచారం.