సినీ రంగంలో ప్రముఖ నటులుగా ఉండి...రాజకీయ అరంగేట్రం కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ - విలక్షణ నటుడు కమల్ హాసన్ కు అనూహ్య సలహాలు వచ్చాయి. ఈ ఇద్దరు నేతలు తమిళ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పార్టీ ఏర్పాటుకు రెడీ అవుతున్న క్రమంలో సినీరంగంలో ఈ ఇద్దరికి సుపరిచితమైన ప్రముఖ హీరోయిన్ నుంచి సూచనలు వచ్చాయి. మొదట తెలుగుదేశం పార్టీలో అనంతరం సమాజ్ వాదీ పార్టీలో కొనసాగిన జయప్రద ఈ ఇద్దరి రాజకీయరంగ ఆరంగేట్రంపై స్పందించారు.
రజనీ - కమల్ లు రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు జయప్రద తెలిపారు. ఈ ఇద్దరు నటులు సినీ రంగంలో ఎంతో గుర్తింపును సంతరించుకున్నారని అయితే రాజకీయాలంటే కేవలం రెండున్నర గంటల సినిమా మాత్రం కాదన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సినిమాలకు - రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారు. సినిమా రంగానికి దూరం అవుతూ రాజకీయాల్లో ప్రవేశం కోసం వారు నిర్దేశించుకున్న దారి పూలదారి మాత్రం కాదని, ఎన్నో ముళ్లు - రాళ్లు ఉంటాయని తన అనుభవం ఆధారంగా జయప్రద వివరించారు. అలాంటి మంచి చెడుల విషయంలో స్తితప్రజ్ఞతతో అడుగువేయాలని ఆమె హితవుల పలికారు.
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందని జయప్రద విశ్లేషించారు. ఈ క్రమంలో తమిళ సినీ రంగంలో తమదైన ముద్ర వేసుకున్న రజనీకాంత్ - కమల్ హాసన్ లు రాణిస్తారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇక తన రాజకీయ పునరాగమనం ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.