ఆ దేశంలో మొత్తం ఎన్నికల ఖర్చు కంటే.. మన ఉప ఎన్నిక ఖర్చు ఎక్కువ: జేపీ హాట్ కామెంట్స్!
ఎన్నికల ఖర్చుపై లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనదేశంలో ఒక పార్లమెంటు స్థానానికి రూ.100 కోట్లకు పైగా, ఒక అసెంబ్లీ స్థానానికి రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికకు రూ.400 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని చెప్పారు.
బ్రిటన్‌లో మొత్తం 650 పార్లమెంట్ స్థానాలున్నాయని.. అక్కడ ఎన్నికల ఖర్చు అంతా కలిపి రూ.250 కోట్లు కూడా అవ్వడం లేదని తెలిపారు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉప ఎన్నిక జరిగితే రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
విచ్చలవిడిగా ఓట్లు కొనే సంస్కృతి పోవాలంటే యువతలో మార్పు రావాలని జయప్రకాష్ నారాయణ్ ఆకాంక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కాదని.. వేలం పాటలని జేపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఉన్నవారు, వారసత్వం ఉన్నవాళ్లే రాజకీయాల్లో నెగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామర్థ్యం ఉన్నవాళ్లకు, మంచివాళ్లకు, నిజాయితీపరులకు నాయకత్వం దక్కడం లేదన్నారు.
ఈ విషయంలో రిషి సునాక్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రిషి సునాక్ 35 ఏళ్లకే ఎంపీ అయ్యారని గుర్తు చేశారు. 42 ఏళ్లకే బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారన్నారు. రిషి సునాక్ ఎన్నికల ఖర్చు కేవలం రూ.2 లక్షలేనని.. ఇక్కడైతే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదన్నారు.
అలాగే దేశంలో యువత రాజకీయాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా సమర్థులైన నాయకులు రాలేరన్నారు. కాటికి కాళ్లు చాపుకున్నవాళ్లు కూడా ఇంకా రాజకీయాల్లో పోటీ చేస్తూ ఉంటే యువతకు ఎప్పుడు అవకాశాలు వస్తాయని జయప్రకాష్ నారాయణ్ ప్రశ్నించారు.
కులం, వారసత్వం, డబ్బు ఖర్చు పెట్టగలగడం ఆధారంగానే ఎన్నికల్లో గెలుస్తున్నారని చెప్పారు. వీరి వల్ల సమర్థులకు, నిజాయితీపరులకు అవకాశాలు దక్కడం లేదని జేపీ వాపోయారు. ఈ రాజకీయ బానిసత్వం కంటే బ్రిటిష్ పాలన నయమని జేపీ హాట్ కామెంట్స్ చేశారు. ఎప్పుడూ పల్లకీలు మోసే బోయీలుగా మిగిలిపోకూడదన్నారు. యువత, ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.