ఒకవైపు ఎమర్జెన్సీకి 40 యేళ్లు పూర్తయ్యాయని అంటూ దేశవ్యాప్తంగా ఇందిర హయాంనాటి ఆ పరిణామం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆ రోజున ఏం జరిగింది.. ఎలాంటి పరిణామాల మధ్య ఎమర్జెన్సీ విధించడం జరిగింది... ఎన్ని రోజుల పాటు అది కొనసాగింది.. ఆ రోజుల్లో ఏం జరిగింది.. అనే అంశం గురించి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఆ రోజుల్లో ప్రభుత్వ తీరుతో జైలు పాలైన వారంతా తమ అనుభవాలను పంచుకొంటున్నారు. తాము ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డామో వివరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎమర్జెన్సీకి 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆ అంశం గురించి లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ స్పందించారు. ఒకింత తీవ్రస్థాయిలో ఉంది ఆయన స్పందన.
ఎమర్జెన్సీకి 40 సంవత్సరాలు పూర్తి అయ్యాయని చాలా మంది అంటున్నారని.. అయితే ఇప్పుడు కూడా ఎమెర్జెన్సీ రోజులే నడుస్తున్నాయని జేపీ అభిప్రాయపడ్డాడు. ప్రత్యేకంగా విధించాల్సిన అవసరమే లేకుండా ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డాడు.
కోట్టు పెట్టి ఓట్లు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిదంటే.. ప్రజాస్వామ్యంలో విలువల పతతానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? అని జేపీ ప్రశ్నిస్తున్నాడు. ఇక వేరే ఎమర్జెన్సీ ఎందుకు? అని ఆయన ప్రశ్నించాడు. అధికారంలో ఉన్న వారి ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవస్థ పనిచేస్తోందని ఆయన ధ్వజమెత్తాడు.
మొత్తానికి మోడీ పాలన అంటూ ప్రత్యేకంగా చెప్పకపోయినా.. ప్రస్తుత పరిణామాలను ప్రస్తావిస్తూనే జేపీ నడుస్తున్నది ఎమర్జెన్సీనే అని స్పష్టం చేస్తున్నాడు.