పదవులు రాలేదని కొందరు బాధపడుతున్నారు. వచ్చిన పదవులను ప్రజల కోసం వినియోగించి.. మళ్లీ మళ్లీ ప్రజాదరణ పొందాలని ఆశిస్తుంటారు. అయితే.. చిత్రం ఏంటో కానీ.. ఇలాంటి వారికి పదవులు దక్కడం అరుదుగానే మారింది. అయితే.. వైసీపీలో ఒక మంత్రిగారికి సంబంధించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని.. ప్రతి ఒక్కరికీ తెలిసిన నేపథ్యంలో ఈ దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలుకూడా పార్టీ అధిష్టానం నుంచి వస్తున్నాయి. దీంతో ఎవరు ఉంటారు? ఎవరు ఊడతారు? అనే చర్చ సాగుతోంది.
సరే! ఈ విషయాన్ని పక్కన పెడితే.. కర్నూలు జిల్లాకు చెందిన ఓ మంత్రి విషయంలో ఆసక్తికర చర్చ వైసీపీలోనే సాగుతుండడం గమనార్హం. ఆయనే గుమ్మనూరు జయరాం. ఆలూరు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకుని అనూహ్యంగా మంత్రి అయిన.. జయరాం.. ఇప్పటి వరకు ఎక్కడా.. అధికారిక కార్యక్రమాల్లో కనిపించలేదని పార్టీ నేతలే అంటున్నారు.
అంటే.. తనకు కేటాయించిన శాఖ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి దూకుడు చూపలేదనేది ప్రధాన విమర్శ. ఇది బయట కూడా ప్రచారంలో ఉంది. ఎందుకంటే..మంత్రి ఏనాడూ తన శాఖ పరంగా ఎక్కడా కనిపించింది లేదు.
ఇక, పనిచేయలేదు.. అనే టాక్ ఉన్నా.. మరో రూపంలో ఇంకో విషయం తెరమీదికి వస్తోంది. ఆయన తన మంత్రిపదవిని వాడుకున్నారని.. టీడీపీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఇటీవ ల ఇవే కామెంట్లతో కొన్ని పోస్టర్లు కూడా వెలిశాయి. ``కుటుంబ మంత్రి`` అని జయరాంపై కామెంట్లు సోష ల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
మరి దీనికి రీజన్ ఏంటి..? అంటే.. గతంలో టీడీపీ నేతలు ఆరోపించినట్టు.. సొంత అవసరాల కోసం.. మంత్రి పనిచేయడం.. తన కుటుంబం ఏం చేసినా.. కాపాడుకునేందుకు తన పదవిని వినియోగించారని.. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనిపై మంత్రి మాత్రం మౌనంగానే ఉండడం గమనార్హం. ఎలాగూ పోయే పదవి గురించి చింతించడం ఎందుకు? అని అనుకుంటున్నారేమో? ! అని అంటున్నారు జిల్లా పరిశీలకులు.