సీన్ రివ‌ర్స్ : శిఖాపై ఆమె ఫిర్యాదు

Update: 2019-02-05 18:00 GMT
వ్యాపార‌వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ ను మించిన మ‌లుపుల‌తో సాగుతోంది. ఇప్ప‌టికే నిందితుల‌ను మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టిన పోలీసులు...ప‌లు అంశాల‌ను వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. చిగురుపాటి మేన‌కోడ‌లు శిఖా చౌద‌రి పాత్ర ఈ హ‌త్య ఏం లేద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ట్విస్ట్ ఇక్క‌డే చోటుచేసుకుంది. శిఖా చౌదరి పాత్రపై సమగ్రంగా విచారణ జరపాలని కోరుతూ జయరాం భార్య పద్మశ్రీ  మంగళవారం జూబ్లీ హిల్స్  పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె పోలీసుల విష‌యంలో ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

మంగ‌ళ‌వారం సాయంత్రం నందిగామ పోలీస్ స్టేషన్‌ లో పెట్టిన ప్రెస్ మీట్ లో కేసు వివరాలను ఎస్పీ త్రిపాఠీ  వివరించారు. నందిగామ డీఎస్పీ ఆధ్వర్యంలో పలు పోలీసుల టీమ్‌ లు ఏర్పాటు చేసి ఈ కేసును  ఛేదించామ‌ని వెల్ల‌డించారు. సీసీటీవీ పుటేజీ - ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా ఈ కేసును తేల్చినట్టు ఎస్పీ త్రిపాఠి చెప్పారు. ఈ కేసులో శిఖా చౌదరికి ఎలాంటి పాత్ర లేదని ఎస్పీ స్పష్టం చేశారు.  అయితే, ఈ ప‌రిణామం త‌ర్వాత చిగురుపాటి జ‌య‌రాం స‌తీమ‌ణి ప‌ద్మ‌శ్రీ హైద‌రాబాద్ జూబ్లిహిల్స్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

త‌న భ‌ర్త కేసులో ప్రధాన నిందితురాలు శిఖా చౌదరి -ఆమె తల్లి సుశీలపై చర్యలు తీసుకోవాలని చిగుర‌పాటి జ‌య‌రాం స‌తీమ‌ణి కోరారు. నందిగామ పోలీసుల విచారణ పై తనకు అనుమానాలు ఉన్నాయని. తన భర్త 2016 లోనే తన అక్క సుశీల,వారి కుటుంబ సభ్యులతో అపాయం ఉందని చెప్పారని ఆమె ఫిర్యాదులో పేర్కోన్నారు. జయరాం హత్య కేసులో ఏపీ పోలీసులు శిఖా చౌదరిని తప్పించారని, శిఖా చౌదరి పాత్రను ఎక్కడా నిర్ధారణ  చేయలేదని పద్శశ్రీ ఆరోపించారు. జయరాం పై రాకేష్ కు చెప్పింది శిఖా చౌదరేనని, ఆమెను ఎందుకు అరెస్టు చేయలేదని, ఆమె ప్రశ్నించారు.
Tags:    

Similar News