బేరం కుదర్లేదా రెడ్డిగారూ...మాట మారింది?

Update: 2019-07-21 06:10 GMT
సినిమాల్లో రాంగోపాల్ వర్మ...రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ ...ఆల్మోస్ట్ సేమ్. పర్యవసానాలు పట్టించుకోెకుండా తమ నోటికి వచ్చింది మాట్లాడేస్తుంటారు. తమ అభిప్రాయమే జన అభిప్రాయంగా చెబుతుంటారు. సనాతనంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వీళ్లు ఆ పార్టీలో ఏపీలో చచ్చిపోవడంతో తప్పక పార్టీ మారారు. కానీ కాంగ్రెస్ లో చెల్లినట్లు మిగతాచోట్ల చెల్లదు కదా. అందుకే పార్టీ మారినా తీరు మారలేదు. దీంతో ప్లేసు దక్కినా పదవి దక్కలేదు. వారి కర్మ ఏంటంటే.. వాళ్లు చేరిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా  చరమాంకానికి వచ్చినట్లు కనిపిస్తోంది. జగన్ ఏమో మంచి ముఖ్యమంత్రి నై 30 ఏళ్లు ఉంటానంటున్నారు. బీజేపీ ఏమో పాత పగలతో బాబు మీద రగిలిపోయి ఆకర్ష ఆకర్ష అంటోంది. దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలుగుదేశం పార్టీలో ఉండలేక... అలాగే ఇంకో పార్టీలోకి పుసుక్కున మారలేక జేసీ బ్రదర్స్ ఒకరకమైన వేదన అనుభవిస్తున్నారు.

వాస్తవానికి వారు 2014 ముందే జగన్ పార్టీలో చేరాల్సింది. అంతకుమునుపు పలుమార్లు తండ్రిపై పెద్ద జేసీ పలు విమర్శలు చేసినా జగన్ ఇగ్నోర్ చేద్దామనుకున్నాడు. కానీ ఎంతనైనా పార్టీ జగన్ ది. అలాంటి పార్టీలో రావడానికి షరతులు పెడితే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. అందుకే వారి తిట్లను ఇగ్నోర్ చేద్దామనుకున్న జగన్ వారినే ఇగ్నోర్ చేసేవారు. ఇక వేరే ఆప్షన్ లేక అప్పట్లో తెలుగుదేశంలో చేరారు. అందుకే అక్కడ పదవి కూడా దక్కలేదు. పోనీలే అధికార పార్టీలో ఉన్నాం అనుకుని హాయిగా గడిపేశారు. కానీ ఏడాది ముందే తెలుగుదేశం పార్టీ ఖతం అని జేసీకి అర్థమైంది. కానీ ఎక్కడో జనం జగన్ ని నమ్మరేమో అని భావించినట్లున్నాడు. మోడీ విషయంలోనూ అంతే. ఆయన అంచనాలు తప్పాయి. అరంగేట్రంలోనే కొడుకు ఓడిపోయాడు. సొంత నియోజకవర్గంలో పట్టుపోయింది. వాస్తవానికి జేసీ అండ ఇపుడు ఎవరికి అవసరం లేదు. జేసీకే ఇంకొకరికి అండ అవసరం. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరడానికి భారీ పదవులు అడగడంతో కాదు పొమ్మన్నారు. బేరాలు సాగుతున్న కాలంలో ఇంక టీడీపీ పని అయిపోయింది కథ కంచికే - టీడీపీ బీజేపీలోకే అనేశారు చిన్న జేసీ. కట్ చేస్తే... బేరం కుదర్లేదు. పార్టీ మారే పరిస్థితి కనిపించడం లేదు. ఏదో అయోమయం. అందుకే ఇపుడు టీడీపీ... బీజేపీలో కలవదు. అయినా నేనంటే జరగడానికి నేనేమైనా పార్టీ అధ్యక్షుడినా అంటూ వ్యాఖ్యానించారు. అనాల్సినవి అనేసి - చేయాల్సిన డ్యామేజ్ చేసేసి ఇపుడు కవర్ చేుసుకుంటున్నారు. చావో రేవో... ఇపుడు కనుక కరెక్టు నిర్ణయం తీసుకోకపోతే వీరి భవిష్యత్తుపై మబ్బులు కుమ్ముకునేలా ఉన్నాయి. ఆ నిర్ణయం ఉన్న పార్టీలో ఉండటం అయినా కావచ్చు - కొత్త పార్టీలో చేరడమైనా కావచ్చు.... జేసీ బ్రదర్స్ కు తక్షణం ఒక క్లారిటీ కావాలి.
   

Tags:    

Similar News