జేసీ బ్ర‌ద‌ర్స్‌కు కుమార సంక‌టం....!

Update: 2023-01-29 05:00 GMT
వారు పెద్ద‌గా ఎన్నిక‌ల వ్యూహాలు వేయాల్సిన అవ‌స‌రం లేదు. ఒక్క పిలుపు ఇస్తే.. ఓట్లు రాలిపోయేవి. గుండుగుత్త‌గా.. గెలుపు గుర్రాన్ని ఎక్కిన‌సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి.  వారే.. జేసీ దివాక‌ర్‌, ప్ర‌భాక‌ర్ రెడ్డిలు. 35 ఏళ్ల‌పాటు తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఏక‌ఛ‌త్రాది ప‌త్యంగా ఏలారు. అనంత పార్లమెంటు నుంచి కూడా గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. అదంతా చ‌రిత్ర‌!

ఇప్పుడు వారి ప‌రిస్థితి మారిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో జేసీ బ్ర‌ద‌ర్స్ త‌మ వార‌సులను రంగంలోకి దింపారు. అయితే.. అనూహ్యంగా ఇద్ద‌రూ ఓడిపోయారు. పోనీ.. ఇప్పుడు ప‌రిస్థితి మెరుగు ప‌డిందా? అంటే.. క‌నిపిస్తున్న దాఖలా లేదు. దీంతో కిం క‌ర్త‌వ్యం అంటూ.. క‌ల‌వ‌ర ప‌డుతున్నార‌ట‌.

35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తనయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు జేసీ దివాకర్‌రెడ్డి. 2019లో అనంతపురం పార్లమెంటుకు బరిలోకి దిగిన జేసీ కుమారుడు... పవన్‌ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో తెలియదు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉండే పవన్‌.. ఎన్నికలైనప్పటి నుంచి అనంతపురం జిల్లాకు వచ్చిన దాఖలాలు లేవు.

పార్టీ కార్యక్రమాల్లోగానీ, సమావేశాల్లోగానీ ఎప్పుడూ పాల్గొనలేదు. తాడిపత్రి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్‌ తమ్ముడు అస్మిత్‌రెడ్డి కూడా అప్పుడప్పుడు తాడిపత్రికి వచ్చి పోతున్నారు. యువ నేతలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నికలప్పుడు వారి వెంటే తిరిగిన తాడిపత్రి  కార్య‌క‌ర్త‌లు ఇప్పుడు దూర‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్వ‌యంగా జేసీ బ్ర‌ద‌ర్సే పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అయితే.. కుమారుల ప‌రిస్థితి ఏంట‌నేది మ‌రోచ‌ర్చ‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News