తన వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఎదుటి వ్యక్తి ఎంతటివారైనా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం జేసీ నైజం. నిండు సభలోనే చంద్రబాబుకు టెలీకాన్ఫరెన్స్ లపై క్లాస్ పీకిన ఘనత జేసీది. చంద్రబాబు సమక్షంలోనే ఆయనకెవరో తప్పుడు సలహాలిస్తున్నారంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు గతంలో కలకలం రేపాయి. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబుపై జేసీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆశ్చర్యకరంగా చంద్రబాబుపై జేసీ పాజిటివ్ వ్యాఖ్యలు చేశారు. విభజనానంతరం చంద్రబాబు చిప్ప తీసుకొని ఏపీకి వచ్చారని - కానీ - ఇన్ని ప్రాజెక్టులు ఎలా కట్టగలుగుతున్నారని చంద్రబాబును జేసీ ప్రశ్నించారు. ఇటువంటి మాయ తానెప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బైరవానితిప్ప ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరణ సందర్భంగా చంద్రబాబునుద్దేశించి జేసీ ఈ కామెంట్స్ చేశారు.
విభజనానంతరం ఏపీకి చిప్పతీసుకువచ్చిన చంద్రబాబుకు మోడీ మొండిచెయ్యి చూపారని జేసీ అన్నారు. పోలవరం ప్రాజెక్టు మొదలు అన్ని చోట్లా చంద్రబాబుకు మోదీ పంగనామాలు పెట్టి - బిచ్చగాడిని చేశారని అన్నారు. చంద్రబాబును విఫలముఖ్యమంత్రిగా చేయాలని మోడీ చూస్తున్నారని, కానీ, పోలవరానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు సామీ అని ఆయననే ప్రశ్నించారు. చంద్రబాబు వద్ద ఏమైనా అక్షయపాత్ర ఉందా లేక డబ్బులు ముద్రించే మిషన్ ఉందా చెప్పాలని జేసీ చమత్కరించారు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా నీరందిస్తోన్న వ్యక్తి చంద్రబాబుని - బాబును మించిన మహానుభావులు లేరని అన్నారు. అనంతపురం కోసం ఏనాడూ ఏ ముఖ్యమంత్రి కష్టపడలేనంతగా బాబు కష్టపడుతున్నారని పొగిడారు. తన ఆరాధ్య దైవం నీలం సంజీవరెడ్డి కూడా చంద్రబాబులా కష్టపడలేదన్నారు.
అయితే, చంద్రబాబును జేసీ ఓ రేంజ్ లో పొగడడం వెనుక పలు కారణాలున్నాయని టాక్ వస్తోంది. తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ కు జేసీకి మధ్య వార్ నడిచిన సందర్భంలో జేసీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని పుకార్లు వచ్చాయి. ఓ దశలో జేసీ రాజీనామా చేస్తానని చంద్రబాబును బెదిరించడం...దీంతో, చంద్రబాబుకూడా జేసీకి గట్టిగానే బదులిచ్చినట్లు వదంతులు వినిపించాయి. చంద్రబాబు రివర్స్ కావడంతో జేసీ కూడా మెత్తబడి...రాజీనామాపై రాజీకొచ్చారని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును జేసీ పొగడ్తలతో ముంచెత్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులోనూ, త్వరలోనే పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతోన్న జేసీ...తన వారసుడిగా పవన్ కు మార్గం సుగమం చేసే ప్రాసెస్ లోనే ఈ ప్రశంసల ఎపిసోడ్ నడిచిందని భోగట్టా. ఏది ఏమైనా...చంద్రబాబుపై జేసీ ప్రశంసల జల్లుపై తెలుగు తమ్ముళ్లు తెగ చర్చించుకుంటున్నారట.