నిత్యం తనదైన శైలిలో వ్యాఖ్యలు..చర్యలతో వార్తల్లో నిలవడం అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పరిపాటి. అనంతపురంలో పోలీసు వ్యవస్థా నిర్వీర్యమైపోయిందని, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ ...అనంతపురం అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా జేసీ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. శనివారం నాడు వినాయక నిమజ్జనం సందర్భంగా చిన్న పొడమల గ్రామంలో ప్రబోధానంద స్వామి వర్గీయులు - గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరగడంతో...గ్రామస్థులకు మద్దతుగా జేసీ రోడ్డుపై బైఠాయించారు. గ్రామస్థులకు న్యాయం చేసేవరకు అక్కడనుంచి కదలనని మొండిపట్టు పట్టారు. జేసీకి మద్దతుగా భారీ సంఖ్యలో టీడీపీ నేతలు - కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో చిన్నపొడమలలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అక్కడకి చేరుకున్నారు.
చిన్నపొడమలలో శనివారం నాడు వినాయక నిమజ్జనం సందర్భంగా స్థానిక ప్రబోధానంద స్వామి వర్గీయులు - గ్రామస్థులకు మధ్య ఘర్షణ జరిగింది. వినాయక నిమజ్జనం ట్రాక్టర్లు తమ ఆశ్రమం మీదుగా వెళ్లనివ్వబోమని స్వామి వర్గీయులు అడ్డుకున్నారు. అయితే, ఆ దారి గుండానే ట్రాక్టర్లు తీసుకెళతామని గ్రామస్థులు పట్టుబట్టారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలోనే నేడు ఉదయం చిన్నపొడమల గ్రామానికి చేరుకున్న జేసీ.. గ్రామస్థులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. గ్రామస్థులకు న్యాయం జరిగేవరకూ తాను వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ ఆశ్రమంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయని, ఆశ్రమ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో, ఘటనాస్థలికి చేరుకున్న ఎస్పీ జీవీ అశోక్ కుమార్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.