ఊహించ‌నిరీతిలో జేసీ రిటైర్మెంట్ ప్లాన్!

Update: 2018-08-29 06:16 GMT
జేసీ దివాక‌ర్ రెడ్డి అన్నంత‌నే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఎవ‌రి పైనైనా స‌రే.. త‌న‌కు తోచింది చెప్పేసే సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌గా గుర్తుకు వ‌స్తారు. టీవీ గొట్టాల‌కు ఆయ‌నంటే అమిత‌మైన ఆస‌క్తి. ఆయ‌న క‌నిపిస్తే.. ఆయ‌న‌తో మాట్లాడ‌కుండా ఉండ‌లేరు. ఆయ‌న క‌నిపించారంటే రెండు మూడు స్క్రోలింగ్ లు.. ఒక బైట్ ప‌క్కాగా టెలికాస్ట్ అవుతుంది.

అందుకే.. జేసీ క‌నిపించినంత‌నే కెమేరాలు వాటంత‌ట అవే రెఢీ అయిపోతుంటాయి. సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే ఆయ‌న‌.. తాజాగా రాజ‌కీయాల‌కు మించిన విష‌యాల గురించి మాట్లాడారు.

తాజాగా ఒక వెబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో త‌న రిటైర్మెంట్ ప్లాన్ గురించి చెప్పుకొచ్చారు. రాజ‌కీయాల నుంచి తాను రిటైర్ అయ్యాక తాను ఎక్క‌డ ఉండ‌నున్న‌ది.. ఏం చేయ‌నున్న విష‌యాన్ని వివ‌రంగా వెల్ల‌డించారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక‌.. చివ‌రి శ్వాస వ‌ర‌కూ  రాజ‌కీయాలు చేసేందుకే ఇష్ట‌ప‌డే తీరుకు భిన్నంగా.. ఒక టైం అనుకొని అప్ప‌టి నుంచి పాలిటిక్స్ నుంచి బ‌య‌ట‌కు రావ‌టం చాలా అరుదుగా జ‌రుగుతుంది.

అలాంటి పని చేస్తానంటున్న జేసీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌టం లేద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నాక వ్య‌వ‌సాయం చేస్తాన‌ని చెప్పారు. ఊరికి వెళ్లి పొలం ప‌నులు చూసుకోవాల‌ని అనుకుంటున్నాన‌ని.. వ్య‌వ‌సాయంలో చేయాల్సింది చాలానే ఉంద‌న్నారు. పొలం ద‌గ్గ‌రే గెస్ట్ హౌస్ ఉంద‌ని.. అక్క‌డికే తాను వెళ‌తాన‌ని.. ఎవ‌రైనా వ‌స్తే మాత్రం వాళ్ల‌కు సాయం చేస్తాన‌ని చెప్పారు.

త‌న రిటైర్మెంట్ ప్లాన్ గురించి ప‌క్కాగా ఉన్న జేసీ.. ఇటీవ‌ల కాలంలో గుడికి వెళ్ల‌టం మానేసిన వైనాన్ని చెప్పారు. ఎందుకిలా అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్త‌క‌ర స‌మాధానాన్ని చెప్పారు. బీడీ తాగుతూ.. సారాయి తాగుతూ.. శిల్పం చెక్కితే.. అక్క‌డికి పోయి దండం పెట్ట‌ట‌మా అన్న ఆలోచ‌న వ‌చ్చింద‌ని.. ఇదంతా రెండేళ్ల క్రితం వ‌చ్చిన ఆలోచ‌న అని అప్ప‌టి నుంచి తాను గుడికి వెళ్ల‌టం మానేసిన‌ట్లు వెల్ల‌డించారు.

గ‌తంలో రెండు.. మూడు నెల‌ల‌కు ఒక‌సారి తానుగుడికి వెళ్లేవాడిన‌ని.. ఇప్పుడు అలా చేయ‌టం లేద‌న్నారు. తిరుప‌తి.. శ్రీ‌శైలం వెళితేనే దైవానుగ్ర‌హం వ‌స్తుందా? అన్న ఆలోచ‌న మొద‌లైంద‌ని.. అప్ప‌టి నుంచి తాను గుడికి వెళ్ల‌టం లేద‌న్నారు. విగ్ర‌హారాధ‌న అవ‌స‌ర‌మా అనిపిస్తోంద‌ని.. అయితే.. దేవుడిపై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌న్నారు. అతీత‌మైన శ‌క్తి ఏదో ఉంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. మొత్తానికి రాజ‌కీయాలు లేకుండా కూడా జేసీ మాట‌లు ఆస‌క్తిక‌రంగా అనిపించ‌ట్లేదు?


Tags:    

Similar News