మీడియా ముందుకు వచ్చారంటే ఏం మాట్లాడుతారో అనే సంచలనాలకు పెట్టింది పేరయిన టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు అదే ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కూడా ఎప్పట్లానే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై జేసీ మండిపడ్డారు. అదే సమయంలో సొంత పార్టీలోని చిత్రమైన రాజకీయాలను సైతం జేసీ కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం వలే జగన్ ప్రవర్తిస్తున్నారని జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని జగన్ కలిసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై జేసీ మాట్లాడుతూ ఈడీ, సీబీఐ కేసులు వచ్చినప్పుడు జగన్ ఢిల్లీకి వెళతారని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం రాష్ట్రపతిని పరేషాన్ చేయడం తప్ప ఒరిగేదేం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ చేసే ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయని జోస్యం చెప్పారు. మధుకొడా, దావూద్ ఇబ్రహీంలా జగన్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జగన్ మూర్ఖత్వంతోనే బంధువులు, నేతలు పార్టీని వీడుతున్నారని జేసీ ఎద్దేవా చేశారు.
కాగా తమ పార్టీలోని పరిణామాలను విశ్లేషిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తలచుకుంటే దారినపోయేవాడిని కూడా మంత్రిని చేయవచ్చునని షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రికి నచ్చిన వ్యక్తిని మంత్రిని చేయడం రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదని జేసీ అన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారని గుర్తు చేశారు. ఈ విషయం జగన్ తెలుసుకోవాలని సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/