తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకరరెడ్డి శుక్రవారం అసెంబ్లీకి వచ్చారు... పార్లమెంటు సమావేవాలు జరుగుతున్న సమయంలో లోక్ సభలో ఉండాల్సిన మీరు ఇక్కడికొచ్చారెందుకని టీడీపీ నేతలు సరదాగా ఆయన్ను ప్రశ్నించడంతో ఆయన.. ''మా వాడికి బుద్ధి చెప్పాలని అసెంబ్లీకి వచ్చాను... మా వాడంటే ఎవరో తెలుసా...? ఎవరో కాదు జగన్'' అన్నారు. అంతేకాదు... శాసనసభలో ఎలా ఉండాలో మావాడికి కాస్త చెప్పాలని వచ్చాను అన్నారు. ఆ తరువాత ఏపీ శాసన సభలో గందరగోళం జరుగుతున్న నేపథ్యంలో ఆయన జోకులేశారు. ఈ మధ్య తమ ఊళ్లో పిల్లలు బాగా అల్లరి చేస్తుంటే పెద్దోళ్లు వారిని మందలించిన స్టైలు మారిందని.. అసెంబ్లీ అనుకుంటున్నారా ఏంట్రా మీరు ఇంత అల్లరి చేస్తున్నారు అని కసురుకుంటున్నారని ఆయన చెప్పడంతో అంతా నవ్వుకున్నారు.
శాసనసభ లాబీల్లో కలియ తిరిగిన ఆయన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో సరదాగా మాట్లాడారు. యనమల, ఆయన ఇద్దరూ పరస్పరం వికటమాడుకున్నారు. చంద్రబాబు నాయుడు హైదరబాదు వదిలేసి విజయవాడలో ఉంటున్నందున సచివాలయంలో అధికారులెవరూ దొరకడం లేదని కూడా ఆయన అన్నారు. కాగా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల నిమిత్తం ఎంపీ జేసీ జేసీ దివాకరరెడ్డి శాసనసభకు వచ్చారు. స్వతాహాగా మాటకారి అయిన ఆయన రాకతో అందరూ ఆయన చుట్టూ చేరడం.. యనమల కూడా హుషారుగా మాట్లాడడంతో కాసేపు నేతల మధ్య సరదా సరదా సంభాషణలు సాగాయి.