సుదీర్ఘ రాజకీయ అనుభవం. అంతకు మించి.. తమకున్న బ్రాండ్ ఇమేజ్ ను నిలబెట్టుకోవటంలో జేసీ మరోసారి సక్సెస్ అయ్యారని చెప్పాలి. పార్టీ ఏదైనా.. తమ పేరుతోనే తమ ప్రాంతంలో రాజకీయం నడిచేలా చేసే నేతలు కొందరు ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఆ కోవలోకే వస్తారు జేసీ ఫ్యామిలీ. రాజకీయంగా సుదీర్ఘకాలం పాటుసాగటమే కాదు.. కొత్త రాజకీయాల్లోనూ తమ పట్టును కోల్పోకుండా నిలవటం వారి ప్రత్యేకతగా చెప్పాలి.
ఎమ్మెల్యేగా పని చేసి.. తాజా మాజీగా ఉన్న ఆయన వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు వెనుకాడకపోవటమే కాదు.. తన వారిని గెలిపించుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి పడిన తపన అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో మరెక్కడా లేని రీతిలో రెండు చోట్ల మాత్రమే టీడీపీ తన అధిక్యతను ప్రదర్శిస్తే..తాడిపత్రిలో మాత్రం అధికారాన్ని సొంతం చేసుకోగలిగింది. దీనికి సంబంధించిన క్రెడిట్ అంతా జేసీకే ఇవ్వాల్సి ఉంటుంది. తాడిపత్రి కాకుండా మరెక్కడ అయినా సరే.. సీన్ ఇలా అయితే ఉండేది కాదని చెప్పాలి.
రాజకీయ వైరుధ్యాల్ని అవసరానికి తగ్గట్లుగా అధిగమించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తన మార్కును ప్రదర్శించారని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన పార్టీ కంటే తన వ్యక్తిగత ఇమేజ్ చాలా ముఖ్యమన్న విషయాన్ని గుర్తించిన జేసీ.. ఇగోలకు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తాడిపత్రి ఛైర్మన్ పదవిని తనకు దక్కేలా చేసుకోవటం కోసం తనకున్న పలుకుబడితో జగన్ వద్దకు పంచాయితీని తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యారని చెబుతున్నారు.
పార్టీల సంగతి పక్కన పెడితే..జేసీ రాజకీయ పరపతికి.. వ్యక్తిగత ఛరిష్మాకు సంబంధించిన విషయం కావటంతో సీఎం జగన్ కూడా ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. తన అధికారాన్ని ప్రదర్శించుకోకపోవటం ద్వారా.. తనకే మైలేజ్ అన్న విషయాన్ని గుర్తించిన జగన్ అండ్ కో.. తాడిపత్రిలో మెజార్టీకి అనుగుణంగా సాగుతామన్న మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే తాను మున్సిపల్ ఛైర్మన్ గా పదవిని చేపట్టిన వెంటనే.. జేసీ ప్రభాకర్ రెడ్డి విపరీతమైన సంతోషానికి గురి కావటమే కాదు.. జగన్ కు ధన్యవాదాలు తెలిపటానికి ఇదే ముఖ్యకారణమని చెబుతున్నారు. ఏమైనా.. రాష్ట్రం మొత్తం ఎలా ఉన్నా.. తన అడ్డాలో తనకు తిరుగులేదన్న విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని చెప్పక తప్పదు.