అర్ధరాత్రి హైడ్రామా: అనంతపురం టు కడపకు జేసీ - అస్మిత్ రెడ్డి

Update: 2020-06-14 04:45 GMT
అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. జేసీ - ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను రాత్రి 2.30గంటలకు అనంతపురం నుంచి వైఎస్ జగన్ సొంత ఇలాకా కడపకు తరలించారు. జేసీ ట్రావెల్స్ బస్సుల గోల్ మాల్ వ్యవహారంలో అరెస్ట్ అయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి - ఆయన కుమారుడు - టీడీపీ తాడిపత్రి ఇన్ చార్జి అస్మిత్ రెడ్డిలను అర్ధరాత్రి కడపలోని కేంద్ర కారాగారానికి తరలించారు.

ముందుగా హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన జేసీ - ఆయన కుమారుడిని అనంతపురం జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని అనంతపురం జైలుకు తరలించాలని తొలుత అధికారులు నిర్ణయించారు.

అయితే అనంతపురం జైలులో ఓ ఖైదీకి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో జేసీ - ఆయన కుమారుడిని ఎక్కడికి తరలించాలనే విషయంపై పోలీసులు తర్జనభర్జనలు పడ్డారు. మరోసారి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కడప మినహా మిగిలిన జైళ్లలో సౌకర్యాలు కొరత ఉందని భావించిన అనంతరం జడ్జి కడప కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశించారు.

దీంతో గురువారం అర్ధరాత్రి 2.30 గంటలకు రోడ్డుమార్గంలో కడప కేంద్ర కారాగారానికి జేసీ ప్రభాకర్ రెడ్డి - ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి పోలీసులు తరలించారు. కడపలో జాప్యం జరిగింది. వీరిని కడప జైలులోకి తరలించే ఫార్మాలటీస్ ప్రక్రియ ఆలస్యం కావడంతో జేసీ, ఆయన కుమారుడు జైలులో ఖైదీలను కలవడానికి వచ్చే గదిలోనే పడుకోవడం గమనార్హం.


Tags:    

Similar News