ఇరు తెలుగు రాష్ట్రాల్లో జేసీ బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. తమ వివాదాస్పద వ్యాఖ్యల తో - దురుసు ప్రవర్తన తో జేసీ బ్రదర్స్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా - ఓ షాపింగ్ కాంప్లెక్స్ యజమానిని తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించిన ఆడియో క్లిప్స్ బయటకు రావడం పెను దుమారం రేపుతోంది. ఓ షాపింగ్ తన కమర్షియల్ కాంప్లెక్స్‌ను జేసీ కబ్జా చేశారని - ఖాళీ చేయమంటే బెదిరిస్తున్నారని మల్లిఖార్జునచారి మీడియా ముందుకు వచ్చాడు. దీంతో, మల్లిఖార్జునాచారి పై జేసీ మండిపడ్డారు. సైలెంట్ గా ఉండకపోతే, ఆ భవనాన్ని కూల్చివేస్తానంటూ బాధితుడికి ఫోన్ లోనే బూతుల తో వార్నింగ్ ఇచ్చారు. అసభ్య పదజాలం తో దూషించారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు మల్లిఖార్జునాచారి కుటుంబం మరోసారి మీడియా ముందుకు వచ్చి...తమకు ప్రాణహాని ఉందని చెప్పింది.
తాడిపత్రి లోని సుభాష్ రోడ్డులో నందిని హోటల్ ఎదురుగా తమ షాపును 2000 సంవత్సరంలో బాబయ్యకు అద్దెకు ఇచ్చామని మల్లిఖార్చునా చారి చెప్పారు. జేసీ బ్రదర్స్ తో బాబయ్య కొన్నేళ్లుగా ‘జేసీ ట్రావెల్స్’ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడని - అగ్రిమెంట్ గడువు ముగియడంతో షాపు ఖాళీ చేయమని చెప్పినా చేయడం లేదని అన్నారు. తనకు పిల్లలున్నారని - ఆ షాపు తనకు అవసరమని జేసీని ఫోన్ లో ప్రాధేయపడినా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనగోడు వినకపోగా తనను ఫోన్ లో బండ బూతులు తిట్టారని...ఆ ఫోన్ సంభాషణను విలేకరులకు వినిపించారు. షాపు వదిలేదే లేదు.. నీ ఇష్టమొచ్చింది చేసుకో అంటూ బండబూతులు తిట్టి తనను గెంటేశారని మల్లికార్జున తనను జేసీ దుర్భాషలాడిన విషయాన్ని ఎస్పీ - డీఐజీ - కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణ భయంతో కోర్టును ఆశ్రయించలేకపోతున్నామని అన్నారు. అధికారులు, పోలీసులు స్పందించి తమ షాపును తమకు ఇప్పించాలని కోరారు. ఆ షాపును తనకు అప్పగించాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన హెచ్చరించారు.