అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. మహిళా కలెక్టర్‌పైనే చిందులు తొక్కారు. అనంతపురం కలెక్టర్ హాల్‌లో ఏకంగా కలెక్టర్‌పైనే విరుచుకుపడ్డారు. కలెక్టర్ నాగలక్ష్మి ఎదుట టేబుల్‌పైన పేపర్లు విసిరేసి ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. నువ్వు కలెక్టర్‌గా పనికిరావంటూ ఆమెను దూషించారు. బీకేర్‌ఫుల్ అంటూ కలెక్టర్‌కే జేసీ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
జేసీ ప్రభాకరరెడ్డిని అడ్డుకోబోయిన కలెక్టర్ గన్‌మెన్‌ను సైతం జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఏ ఆగవయ్యా అంటూ నెట్టేశారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళ్తే.. తాడిపత్రిలో ఓ భూవివాదం గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి.. అనంతపురం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి కలిశారు.
అందరికీ కలెక్టర్ అవకాశం రాదని.. ఎవరికో కొంతమందికి మాత్రమే కలెక్టర్ అవకాశం వస్తుందని.. కలెక్టర్‌గా పనిచేయడం నేర్చుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మికే జేసీ ప్రభాకర్‌రెడ్డి పాఠాలు చెప్పడం గమనార్హం.
ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. కలెక్టర్‌ను బెదిరిస్తున్న క్రమంలో గన్‌మెన్.. ప్రభాకర్ రెడ్డిని వారించే ప్రయత్నం చేయగా జేసీ ఇంకా రెచ్చిపోయారు. కలెక్టర్ గన్‌మెన్‌ను వెనక్కి నెట్టివేశారు. అక్కడే ముగ్గురు, నలుగురు పోలీసు అధికారులు ఉన్నా అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. జేసీని చూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలోనే బీకేర్‌ఫుల్ అంటూ కలెక్టర్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పటికే పోలీసులను దూషించడం, కులం పేరుతో తిట్టడం, దివాకర్ ట్రావెల్స్ పేరుతో తప్పుడు పద్ధతుల్లో బస్సులు కొనడం, సంతకాలు ఫోర్జరీ చేయడం, వాటిని తిరిగి మళ్లీ బీఎస్4 వాహనాలుగా అమ్మడం వంటి పనులు చేయడం వంటి కేసుల్లో ఇప్పటికే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అనేక కేసులు నమోదై ఉండటం గమనార్హం..
2019 ఎన్నికల్లో తాడిపత్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి, అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసినా జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ సీట్లు దక్కించుకోవడంతో మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎంపికయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
జేసీ ప్రభాకరరెడ్డిని అడ్డుకోబోయిన కలెక్టర్ గన్‌మెన్‌ను సైతం జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఏ ఆగవయ్యా అంటూ నెట్టేశారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళ్తే.. తాడిపత్రిలో ఓ భూవివాదం గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి.. అనంతపురం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి కలిశారు.
అందరికీ కలెక్టర్ అవకాశం రాదని.. ఎవరికో కొంతమందికి మాత్రమే కలెక్టర్ అవకాశం వస్తుందని.. కలెక్టర్‌గా పనిచేయడం నేర్చుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మికే జేసీ ప్రభాకర్‌రెడ్డి పాఠాలు చెప్పడం గమనార్హం.
ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. కలెక్టర్‌ను బెదిరిస్తున్న క్రమంలో గన్‌మెన్.. ప్రభాకర్ రెడ్డిని వారించే ప్రయత్నం చేయగా జేసీ ఇంకా రెచ్చిపోయారు. కలెక్టర్ గన్‌మెన్‌ను వెనక్కి నెట్టివేశారు. అక్కడే ముగ్గురు, నలుగురు పోలీసు అధికారులు ఉన్నా అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. జేసీని చూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలోనే బీకేర్‌ఫుల్ అంటూ కలెక్టర్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పటికే పోలీసులను దూషించడం, కులం పేరుతో తిట్టడం, దివాకర్ ట్రావెల్స్ పేరుతో తప్పుడు పద్ధతుల్లో బస్సులు కొనడం, సంతకాలు ఫోర్జరీ చేయడం, వాటిని తిరిగి మళ్లీ బీఎస్4 వాహనాలుగా అమ్మడం వంటి పనులు చేయడం వంటి కేసుల్లో ఇప్పటికే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అనేక కేసులు నమోదై ఉండటం గమనార్హం..
2019 ఎన్నికల్లో తాడిపత్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి, అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసినా జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ సీట్లు దక్కించుకోవడంతో మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎంపికయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.